WhatsApp: వాట్సాప్‌లో ఫార్వార్డ్ చెత్తంతా ఒక్క క్లిక్‌తో డిలీట్ చేయండి, ఫీచర్ యాక్టివేట్ చేసుకోండి ఇలా ? 

Wednesday, December 16, 2020 03:15 PM Technology
WhatsApp: వాట్సాప్‌లో ఫార్వార్డ్ చెత్తంతా ఒక్క క్లిక్‌తో డిలీట్ చేయండి, ఫీచర్ యాక్టివేట్ చేసుకోండి ఇలా ? 

ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ తన వినియోగదారుల కోసం మరో సరికొత్త ఫీచర్‌ను తీసుకువచ్చింది. ఈ కొత్త ఫీచర్ ద్వారా మీరు మీ వాట్సాప్ లో ఫార్వార్డ్ చేసిన వీడియోలు ఇమేజ్ లు అన్నీ ఒకేసారి డిలీట్ చేసుకోవచ్చు. దీని ద్వారా మీ వాట్సాప్ స్పేస్ చాలా సేవ్ అవుతుంది కూడా. పలు గ్రూపులు, వ్యక్తుల నుంచి ఇబ్బడి ముబ్బడిగా వచ్చి పడుతున్న మెసేజ్‌లను, ఫోటోలను, వీడియోలు తదితర కంటెంట్‌ను డిలీట్‌​ చేయడానికి WhatsApp Disappearing Messages ఫీచర్ ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ఫీచర్ సాయంతో వాట్సాప్ యూజర్లు జంక్ మెసేజెస్‌ను తొలగించి తమ ఫోన్‌లలో స్టోరేజ్‌ డాటాను పెంచుకోవచ్చని వాట్సాప్‌ వెల్లడించింది.

WhatsApp Disappearing Message ఫీచర్ ను చెక్ చేయడం ఎలా ? 
ముందుగా మీరు వాట్సాప్ యాప్‌లోని సెట్టింగ్స్‌లోకి వెళ్లండి
అక్కడ కనిపించే స్టోరేజి అండ్ డేటాలోను క్లిక్ చేయండి.
అక్కడ మీకు Manage Storage అని కనిపిస్తుంది.
దాన్ని క్లిక్ చేస్తే మీకు మీడియా కంటెంట్ మొత్తం చూపిస్తుంది.
ఎంత స్టోరేజ్‌ వినియోగించాం. అలాగే చాలాసార్లు ఫార్వార్డ్ చేయబడిన మీడియా ఫైళ్ళను  ప్రత్యేకంగా చూపిస్తుంది. 
ఆ ఫైళ్ళను సులభంగా గుర్తించి డిలీట్‌​ చేయడానికి అక్కడ సెలక్ట్ ఆల్ అనే బటన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే మొత్తం ఫార్వార్డ్ ఫైళ్లు డిలీట్ అయిపోతాయి. 

ఈ ఫీచర్ 5ఎంబీ కంటే ఎక్కువ సైజులో ఉన్న ఫైలును గుర్తిస్తుంది. పరిమాణంలో ఫైల్ సైజ్‌ను బట్టి విడివిడిగా చూపిస్తుందని, దాని ద్వారా అవసరమైన వాటిని, అనవసరమైన వాటిని వినియోగదారులు త్వరగా గుర్తించగలుగుతారని సంస్థ చెప్పింది. అంతేకాకుండా ఒకటి లేదా చాలా వాటిని డిలీట్ చేయడానికి ముందు ఒకసారి చూసుకునే వెసులుబాటును కల్పిస్తుందని అన్నారు. అయితే ఈ ఫీచర్ ప్రపంచ వ్యాప్తంగా ఈ వారంలో విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఇక ఈ ఫీచర్ ద్వారా పలుసార్లు ఫార్వార్డ్ చేసిన, అనవసరమైన  వీడియోలను, ఫొటోలను క్లీన్ చేసుకునేందుకు మరింత సులభం తొలగించుకోవచ్చు. 
 

For All Tech Queries Please Click Here..!