Sex in Space: ఇప్పటివరకు శృంగారం జరగని ప్రదేశం ఉందని ఎవరికైనా తెలుసా ?

Saturday, December 12, 2020 04:00 PM Technology
Sex in Space: ఇప్పటివరకు శృంగారం జరగని ప్రదేశం ఉందని ఎవరికైనా తెలుసా ?

మనిషి జీవితంలో శృంగారం అనేది ప్రముఖ పాత్రను పోషిస్తుందన్న సంగతి ప్రతి ఒక్కరికీ తెలిసిందే. ఇది ప్రకృతి సిద్ధమైన చర్య కూడా.. భూమి ఏర్పడిన తరువాత జీవం ఏర్పడి అంతకంతకు అభివృద్ధి చెందుతూ ఇప్పుడిలా ఉందంటే దానికి కారణం శృంగారమే అని చెప్పవచ్చు. ఎవరికీ తెలియని సీక్రెట్ ప్రదేశాల్లో, రాత్రి సమయాల్లో దంపతులు చాలామంది తమ పని కానిస్తుంటారు. అయితే ఇప్పటివరకు శృంగారం జరగని ప్రదేశం ఒకటి ఉందంటే నమ్మగలరా..అయితే దాని గురించి తెలుసుకోవాలనుకుంటే అంతరిక్షంలోకి వెళ్లాల్సిందే. అంతరిక్షంలో ఇప్పటి వరకు ఎవరూ శృంగారంలో పాల్గొనలేదు.

ఇప్పటికే వ్యోమగాములు విజయవంతంగా అంతరిక్షంలో అడుగుపెట్టడం, క్షేమంగా భూమికి తిరిగిరావడంతో సాధారణ ప్రజలను అక్కడి పంపే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరి అక్కడికి వెళ్లిన తరువాత వీరు తమ పని కానిచ్చే అవకాశం ఉందా..అంటే కష్టమేనంటున్నారు శాస్త్రవేత్తలు. అయితే స్పేస్ టూరిజం పేరుతో కొంత మంది పర్యాటకులను వచ్చే ఏడాది అంతరిక్షంలోకి పంపడానికి ‘స్పేస్‌ఎక్స్' అనే సంస్థ సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఓ కొత్త అంశం తెరపైకి వచ్చింది. టూరిజం అంటున్నారు కాబట్టి.. కచ్చితంగా జంటలు వెళతాయి. మరి వారు అక్కడ సెక్స్‌లో పాల్గొనాలంటే కుదురుతుందా అనే ప్రశ్న తలెత్తింది.

దీనిపై నాసా హ్యూమన్ రీసెర్చ్ ప్రోగ్రాం మాజీ చీఫ్ సైంటిస్ట్ మార్క్ షెల్హమెర్ స్పందిస్తూ ‘సెక్స్‌కి మొదట ఏకాంతత కావాలని, ఒక వేళ స్పేస్‌ఎక్స్ ఇద్దరు పర్యాటకుల్ని చంద్రుడి మీదికి పంపితే.. వారితో పాటు ఒక నిపుణుడైన వ్యోమగామి కూడా వెళ్తాడు. అలాంటప్పుడు వారిద్దరి మధ్య అది ఎలా కుదురుతుందని గిజ్మోడో అనే వెబ్‌సైట్‌కి మార్క్ వెల్లడించారు. అంతరిక్షంలో మైక్రో‌గ్రావిటీ అనేది శృంగారానికి పెద్ద అడ్డంకిగా నిలుస్తుందని అండర్సన్ యూనివర్సిటీ ఫిజికల్ సైన్సెస్, ఇంజినీరింగ్ డిపార్ట్‌మెంట్ హెడ్ జాన్ మిల్లిస్ చెప్పారు. ‘జీరో గ్రావిటీలో తేలియాడుతూ ఒకరికొకరు ఎదురెదురుగా ఉండి దగ్గర కావడం సాధ్యం కాదు' అని గిజ్మోడో‌కు వెల్లడించారు.

అంతరిక్షంలో ఉన్నప్పుడు మన శరీరంలో రక్త ప్రసరణ అనేది మెదడుకు చాలా సులభంగా జరుగుతుందట. కాబట్టి గుండె పనితీరు కాస్త మందగిస్తుంది. కాబట్టి ఇలాంటి టైంలో మనం ఎక్కువ ఉత్సాహానికి గురికావడం, సెక్స్‌లో పాల్గొనడం వల్ల ప్రాణహాని ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. వాస్తవానికి స్పేస్ఎక్స్ పంపే ‘క్రూ డ్రాగన్' ద్వారా వచ్చే ఏడాది ఏడుగురిని అంతరిక్షంలోకి పంపేందుకు ప్రయత్నిస్తున్నారు
 

For All Tech Queries Please Click Here..!