RTGS: నేటి నుంచి ఎంతైనా డబ్బు బదిలీ చేసుకోవచ్చు

Sunday, January 31, 2021 04:30 PM Technology
RTGS: నేటి నుంచి ఎంతైనా డబ్బు బదిలీ చేసుకోవచ్చు

Mumbai, December 14: డిజిటల్‌ చెల్లింపుల ప్రోత్సాహాంలో భాగంగా నేటి నుంచి రియల్‌ టైమ్‌ గ్రాస్‌ సెటిల్‌మెంట్‌ సిస్టమ్‌ (RTGS) సేవల్ని ఇక 24 గంటలూ అందుబాటులోకి తెస్తున్నట్టు భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (RBI) ప్రకటించింది. ఆదివారం అర్ధరాత్రి 12.30 గంటల నుంచి ఈ సేవలు అందుబాటులోకి వస్తాయని ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ చెప్పారు. ఇప్పటివరకు ఆర్టీజీఎస్‌ (RTGS Money Transfer) నిరంతర సేవల్ని కొన్ని దేశాలే అందిస్తున్నాయి. ఆర్బీఐ తాజా నిర్ణయంతో భారత్‌ కూడా ఆ దేశాల సరసన నిలిచింది. దీంతో పాటు పాయింట్‌ ఆఫ్‌ సేల్‌ (పీవోఎస్‌)లలో రూ.2,000గా ఉన్న కాంటాక్ట్‌లెస్‌ కార్డు లావాదేవీల పరిమితిని రూ.5,000 పెంచుతున్నట్టు తెలిపింది. జనవరి 1,2021 నుంచి ఈ సదుపాయం అందుబాటులోకి తీసుకువస్తున్నట్టు వెల్లడించింది.

ఇప్పటివరకు ఆర్‌టీజీఎస్ సేవలు (Real-Time Gross Settlement System) అన్ని పనిరోజుల్లో కేవలం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం ఆరుగంటల వరకు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. తాజా నిర్ణయంతో 24 గంటల పాటు ఎప్పుడైనా లావాదేవీలు జరుపుకోవచ్చు. అదిక మొత్తంలో నగదు బదిలీ చేసేందుకు ఆర్టీజీఎస్ వినియోగిస్తుండగా నెఫ్ట్ ద్వారా కేవలం రూ. 2 లక్షల లోపు మాత్రమే నగదు బదిలీ చేసుకునే అవకాశం ఉంది. డిసెంబర్ 2019 నుంచి నెఫ్ట్ (నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్ ఫర్ విధానాన్ని అన్ని రోజుల్లో నిరంతర (24X7) సదుపాయాన్ని ఆర్‌బీఐ అందుబాటులోకి తీసుకువచ్చిన సంగతి విదితమే. 

For All Tech Queries Please Click Here..!