స్మార్ట్‌ఫోన్ అమ్మకాలను భారీగా దెబ్బకొట్టిన కోవిడ్

Sunday, January 10, 2021 01:00 PM Technology
స్మార్ట్‌ఫోన్ అమ్మకాలను భారీగా దెబ్బకొట్టిన కోవిడ్

కరోనా దెబ్బ స్మార్ట్ ఫోన్ కంపెనీలపై బలంగానే తాకింది. దసరా, దీపావళి పండుగా సీజన్ లో రికార్డు స్థాయిలో జరిగిన స్మార్ట్ ఫోన్ అమ్మకాలు ఆ తర్వాత డిమాండ్ 20-25% పడిపోయిందని నిపుణులు తెలిపారు. ఇది తమకు బ్లాక్ సీజన్ అని నేషనల్ రిటైల్ స్టోర్ అసోసియేషన్ ఆవేదన వ్యక్తం చేసింది. మొత్తంగా ఈ ఏడాది అమ్మకాలు సంవత్సరానికి 50% పైగా పడిపోయాయని చెప్పారు. కౌంటర్ పాయింట్ టెక్నాలజీ మార్కెట్ రీసెర్చ్ ప్రకారం, స్మార్ట్ ఫోన్ అమ్మకాలు నవంబర్ లో 25% వరకు పడిపోయాయి.

ఇదిలా ఉంటే వచ్చే డిసెంబరు నెలలో అమ్మకాలు మరింత తగ్గుతాయనే విషయం ఆందోళన కలిగిస్తుందని కౌంటర్ రీసెర్చ్ తెలిపింది. సాధారణంగా దీపావళి తరువాత నెలవారీ అమ్మకాలు పడిపోతాయి. అయితే ఈ సంవత్సరం కొంచెం ఎక్కువగా పడిపోయే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. దసరా పండుగ సీజన్ నేపథ్యంలో సెప్టెంబర్ నెలలో ఎక్కువ షిప్‌మెంట్స్ ఉంటాయి. ఈసారి దీపావళి తర్వాత కూడా సేల్స్ వెంటనే పడిపోయాయి.

 పండుగ అమ్మకాల కోసం కంపెనీలు ఫోన్లను నిల్వ చేయటం వల్ల సెప్టెంబర్ లో సాధారణంగా కన్న ఎక్కువ అమ్మకాలు జరిగాయి. కానీ దీపావళి అమ్మకాల తరువాత వెంటనే అమ్మకాలు పడిపోయాయి. దాదాపు ఈ తగ్గుదల శాతం 20 నుండి 25 వరకు ఉండవచ్చని" కౌంటర్ పాయింట్ పరిశోధనా డైరెక్టర్ తరుణ్ పాథక్ అన్నారు. సాధారణంగా పండుగ సీజన్ లో డిస్కౌంట్లు, క్యాష్ బ్యాక్ లు ఇవ్వడం వల్ల సాధారణం కంటే 2-3 రెట్లు ఎక్కువ అమ్మకాలు జరుగుతాయి. అలాగే పండుగ సీజన్ తర్వాత అమ్మకాలు తగ్గుతాయని అశ్విని భడోరియా అన్నారు. షియోమి, వివో, రియల్‌మీతో సహా అగ్ర బ్రాండ్‌లు ఈ సీజన్‌లో అత్యధిక దీపావళి అమ్మకాలను జరిపినట్లు తెలిపాయి. ఆపిల్ జూలై-సెప్టెంబర్ కాలంలో అత్యధికంగా ఎగుమతులు నమోదు చేసింది. లేటెస్ట్ ఐఫోన్స్ లాంచింగ్‌కు ముందే సేల్స్ రికార్డు సృష్టించాయి. తమకు అక్టోబర్ ఒక చెత్త నెల అని, నవంబర్ నెలలో సేల్స్ పుంజుకున్నప్పటికీ దీపావళి తర్వాత మళ్లీ పడిపోయాయని రిటైలర్స్ వాపోతున్నారు.

8.3 బిలియన్‌ డాలర్ల బిజినెస్‌
ఇక ఆన్‌లైన్‌ ద్వారా ఈ ఏడాది అక్టోబర్‌- నవంబర్‌ మధ్య నెల రోజుల కాలంలో ఏకంగా 8.3 బిలియన్‌ డాలర్ల(రూ. 61,000 కోట్లకుపైగా) విలువైన బిజినెస్‌ జరిగింది. దేశీయంగా పండుగల సీజన్‌గా పేర్కొనే ఈ కాలంలో ఆన్‌లైన్‌ అమ్మకాలు ఏకంగా 65 శాతం జంప్‌చేశాయి. గతేడాది ఇదే కాలంలో స్థూలంగా 5 బిలియన్‌ డాలర్ల(రూ. 37,000 కోట్లు) అమ్మకాలు మాత్రమే నమోదయ్యాయి. కన్సల్టింగ్‌ సంస్థ రెడ్‌సీర్‌ నివేదిక వివరాలను విడుదల చేసింది. నిజానికి 7 బిలియన్‌ డాలర్ల అమ్మకాలను అంచనా వేసినట్లు రెడ్‌సీర్‌ ఈ సందర్భంగా పేర్కొంది.

For All Tech Queries Please Click Here..!