జియో రూటర్ 50Mbps స్పీడ్ మాత్రమే ఆఫర్ చేస్తోంది, మరి 100Mbps స్పీడ్ ఎలా పొందాలి ?

Thursday, October 17, 2019 03:00 PM Technology
జియో రూటర్ 50Mbps స్పీడ్ మాత్రమే ఆఫర్ చేస్తోంది, మరి 100Mbps స్పీడ్ ఎలా పొందాలి ?

రిలయన్స్‌ జియో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఆప్టికల్‌ ఫైబర్‌ ఆధారిత జియోఫైబర్‌ సర్వీసులను  కమర్షియల్‌గా సెప్టెంబరు​ 5 నుంచి ప్రారంభించింది. జియో ఫైబర్‌ కస్టమర్లకు ల్యాండ్‌లైన్‌ నుంచి జీవితాంతం ఉచిత వాయిస్‌ కాల్స్, సెకనుకు 100 మెగాబిట్‌ నుంచి 1 గిగాబిట్‌ దాకా స్పీడ్‌తో బ్రాడ్‌బ్యాండ్‌ సేవలు అందుతాయి.  బ్రాంజ్‌, సిల్వర్‌,  గోల్డ్‌, డైమండ్‌, ప్లాటినం, టైటానియం  పేరుతో మొత్తం  6 ప్లాన్లను జియో పరిచయం చేసింది. జియో ఫైబర్‌ ప్లాన్లు నెలకు రూ. 699 నుంచి ప్రారంభమవుతాయి. భారతదేశంలోని 1,600 నగరాల్లో బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ సర్వీస్ - జియో ఫైబర్ - దాని "ఫైబర్ టు ది హోమ్" సేవను ప్రారంభించినట్లు జియో ప్రకటించింది. జియో ఫైబర్ ప్లాన్లు నెలకు రూ. 699 నుంచి 8,499 మధ్య ఉంటాయి. జియో ఫైబర్ అల్ట్రా-హై-స్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ (1 జిబిపిఎస్ వరకు), ఉచిత దేశీయ వాయిస్ కాలింగ్, కాన్ఫరెన్సింగ్ , ఇంటర్నేషనల్ కాలింగ్, టివి వీడియో కాలింగ్,  కాన్ఫరెన్సింగ్, నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వంటి ఎంటర్టైన్మెంట్ ఓవర్ టాప్ (ఒటిటి) అనువర్తనాలు వంటి సేవలను అందిస్తుంది. గేమింగ్, హోమ్ నెట్‌వర్కింగ్, పరికర భద్రత, వర్చువల్ రియాలిటీ అనుభవం,  ప్రీమియం కంటెంట్ ప్లాట్‌ఫాం తమదనిరిలయన్స్ జియో తెలిపింది.  ప్రపంచ రేట్ల కంటే పదోవంతు కంటే తక్కువ ధరలకు ధర నిర్ణయించింది, అందరికీ అందుబాటులో ఉండేలా చేయడానికి, ప్రతి బడ్జెట్‌కు,  ప్రతి అవసరానికి అనుగుణంగా ప్లాన్లను సిద్ధం చేశామని తెలిపింది. 

కాగా డిపాజిట్ కింద రూ.2500 సింగిల్ రూటర్ కి అలాగే డ్యూయెల్ బాండ్ విడ్త్ కింద ర. 4500 ఛార్జ్ చేస్తోంది. సింగిల్ రూటర్ అయితే 50Mbps స్పీడుతోనూ డ్యూయల్ బాండ్ విడ్త్ అయితే 100Mbps స్పీడుతోనూ సేవలు అందుతాయని తెలుస్తోంది. దీని ప్రకారం సింగిల్ రూట్ కొన్నవారు కేవలం  50Mbps స్పీడుతో జియో ఇంటర్నెట్ సేవలను పొందుతారు. అయితే యూజర్లకు 100 ఎంబిపిఎస్ స్పీడును ఆఫర్ చేస్తామని జియో ప్రామిస్ చేసింది. అయితే యూజర్లు 100 ఎంబిపిఎస్ స్పీడును ఎలా పొందాలనే దానికి కొన్ని సూచనలు చేసిందని తెలుస్తోంది. వైఫై రూటర్ ద్వారా కాకుండా Ethernet cable ద్వారా యూజర్లు ఈ స్పీడును పొందవచ్చని తెలుస్తోంది.

యూజర్లు ఈ కేబుల్ ను తమ పీసిలకు కాని ల్యాపీలకు కాని కనెక్ట్ చేసుకోవడం ద్వారా 100Mbps స్పీడును పొందవచ్చు. వైఫై రూటర్ ద్వారా ఇది సాధ్యం కాదని తెలుస్తోంది. కేవలం 50 ఎంబిపిఎస్ స్పీడు మాత్రమే రూటర్ ద్వారా కంపెనీ ఆఫర్ చేస్తోంది. జియో అనధికార సమాచారం ప్రకారం జియో సింగిల్ వైఫ్ రూటర్ 2.5GHz bandwidthతో వస్తోంది. కాబట్టి ఇది కొంచెం స్లోగా ఉంటుందని తెలిసింది. అదే dual-band router అయితే  2.5GHZ and 5GHZ bandwidthsతో వస్తుంది కాబట్టి యూజర్లు 100 స్పీడును పొందుతారని తెలుస్తోంది. అయితే జియో రూటర్ ఇన్ స్టాలేషన్ పక్రియ వచ్చేవరకు దీనిపై స్పష్టత లేదు. 

For All Tech Queries Please Click Here..!