దడపుట్టిస్తున్న జియో, ఉచిత డేటాతో BSNL గట్టి సమాధానం

Wednesday, September 18, 2019 03:03 PM Technology
దడపుట్టిస్తున్న జియో, ఉచిత డేటాతో BSNL గట్టి సమాధానం

టెలికం సంస్థల మధ్య పోటాపోటీ డేటా వార్ నడుస్తూనే ఉంది.. 2 జీ నుంచి 3 జీకి.. 3జీ నుంచి 4జీకి ఇలా ఆఫర్ల పోటీ కొనసాగుతూనే ఉంది. అదీ కాకుండా వచ్చే నెలలో అధికారికంగా రిలీజ్ కాబోతున్న జియో ఫైబర్ టెలికామ్ కంపెనీల్లో దడ పుట్టిస్తోంది.ఈ నేపథ్యంలోనే  ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ రూ.96, రూ.236 పేరిట రెండు నూతన ప్రీపెయిడ్ ప్లాన్లను ప్రవేశపెట్టింది. ఈ రెండు ప్లాన్లలోనూ కస్టమర్లకు రోజుకు 10జీబీ 4జీ డేటా లభిస్తుంది. రూ.96 ప్లాన్ వాలిడిటీ 28 రోజులు ఉండగా, రూ.236 ప్లాన్ వాలిడిటీ 84 రోజులుగా ఉంది.

అయితే ఈ ప్లాన్లు కేవలం 4జీ నెట్‌వర్క్ ఉన్న చోటే వినియోగదారులకు లభ్యమవుతున్నాయి. ముఖ్యంగా అకోలా, భండారా, బీడ్, జైనా, ఉస్మానాబాద్ తదితర ప్రాంతాల్లోని బీఎస్‌ఎన్‌ఎల్ 4జీ కస్టమర్లు ఈ ప్లాన్లను ఉపయోగించుకోవచ్చు. అయితే కేవలం పరిమిత ఆఫర్‌గానే బీఎస్‌ఎన్‌ఎల్ ఈ ప్లాన్లను అందిస్తున్నది.

ఇక బ్రాడ్ బ్యాండ్ విషయానికి వస్తే బీఎస్ఎన్ఎల్ బ్రాడ్‌బ్యాండ్ యాన్యువల్ ప్లాన్స్ ఎంచుకునేవారికి రూ.999 విలువ గల అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా ఇస్తామని బీఎస్ఎన్ఎల్ ప్రకటించింది. రూ.399 లేదా అంతకన్నా ఎక్కువ ప్లాన్స్ తీసుకునే బ్రాడ్‌బ్యాండ్ యూజర్లకు మాత్రమే అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ ఫ్రీ ఆఫర్ వర్తిస్తుంది. అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా పొందినవాళ్లు ప్రైమ్ వీడియో సేవలతో పాటు అమెజాన్ ప్రైమ్ షాపింగ్, అమెజాన్ ప్రైమ్ మ్యూజిక్ లాంటి సేవల్ని పొందొచ్చు. ఈ ఆఫర్ అన్ని సర్కిల్స్‌లోని బీఎస్ఎన్ఎల్ బ్రాడ్‌బ్యాండ్ యూజర్లు ఉపయోగించుకోవచ్చు. అంతేకాదు... కొన్ని యాన్యువల్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లపై 25 శాతం క్యాష్‌బ్యాక్ కూడా ఇస్తోంది బీఎస్ఎన్ఎల్.

ఇదిలా ఉంటే కొద్దిరోజుల క్రితం ఎయిర్‌టెల్ వీ-ఫైబర్ కొత్త, పాత కస్టమర్లకు బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లపై బెనిఫిట్స్ ప్రకటించింది. ఎయిర్‌టెల్ వీ-ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ బేసిక్ ప్లాన్ ప్రారంభ ధర నెలకు రూ.799. అందులో 40 ఎంబీపీఎస్ వేగంతో నెలకు 100 జీబీ మాత్రమే ఇంటర్నెట్ డేటా లభిస్తుంది. అందులో ల్యాండ్‌లైన్ టెలిఫోన్ అన్‌లిమిటెడ్ కాల్స్ లభిస్తాయి. ఆరు నెలలకు 200 జీబీ బోనస్ డేటా కూడా ప్రకటించింది ఎయిర్‌టెల్.

For All Tech Queries Please Click Here..!