Deep Nude App: ఈ యాప్ వాడితే ఎదుట ఉన్నవారిని ఒంటి మీద నూలు పోగు లేకుండా చూడవచ్చట

Tuesday, December 1, 2020 02:00 PM Technology
Deep Nude App: ఈ యాప్ వాడితే  ఎదుట ఉన్నవారిని ఒంటి మీద నూలు పోగు లేకుండా చూడవచ్చట

టెక్నాలజీని మంచికి వాడితే అంతా బాగానే ఉంటుంది. కానీ చెడుకు వాడితేనే నష్టం. ఇప్పుడదే మన జీవితాలను రోడ్డున పడేస్తోంది. అభాసుపాలు చేస్తోంది. ఇప్పుడు మార్కెట్లోకి వచ్చిన కొత్తరకం యాపులతో శృంగారం శృతి మించుతోంది. టిక్ టాక్ వంటి యాప్ ల వల్ల ప్రాణాలు పోతున్నాయి. జుగుప్స పెరిగిపోయింది.

ఇప్పుడు అంతకుమించిన యాప్ వచ్చేసింది. మహిళలను మరింత ఇబ్బందుల్లోకి నెట్టేలా ఈ యాప్ ఉంది. నిండుగా దుస్తులు ధరించి సంప్రదాయబద్దంగా ఉండే మహిళలను కూడా పూర్తి నగ్నంగా చూపించే యాప్ వచ్చేసింది. ‘డీప్ న్యూడ్’ పేరుతో కృత్రిమ మేథ సాయంతో ఈ యాప్ రూపొందించారు.

బట్టలు వేసుకొని నిండుగా ఉన్న మహిళల ఫొటోలను ఈ యాప్ లో ఓపెన్ చేస్తే వారు పూర్తి నగ్నంగా కనిపించేలా దీన్ని రూపొందించారు. ఇది పెద్ద దుమారం రేపుతోంది. దాన్ని చెడుగానే ఎక్కువగా ఉపయోగిస్తారని చాలా మంది మండిపడుతున్నారు. కాగా ఈ యాప్ ను ఇంటర్నెట్ లో విడుదల చేయగానే 5 లక్షల మంది ఇప్పటికే డౌన్ లోడ్ చేసుకొని వాడేశారు. తీవ్ర వివాదాస్పదం కావడంతో ఈ ‘డీప్ న్యూడ్’ యాప్ ను ఇంటర్నెట్ నుంచి తొలగించారు. అయినా ఇది వక్రమార్గాన జనాలకు చేరువవుతూనే ఉందట.

For All Tech Queries Please Click Here..!