తనపై అత్యాచార ఆరోపణలు మోపారన్న షోయబ్ అక్తర్

Monday, June 8, 2020 08:13 PM Sports
తనపై అత్యాచార ఆరోపణలు మోపారన్న షోయబ్ అక్తర్

తనకి కోపం ఎక్కువ కాబట్టి సహచర క్రికెటర్లతో గొడవ పడ్డానని పాక్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ తెలిపాడు ఈ రోజు హాలో లైవ్‌ షోయబ్ అనేక ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకున్నాడు. షోయబ్ అక్తర్ హలో లైవ్ ముఖ్యాంశాలు మీకోసం.... 

ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా చాలా కష్టమైన జట్లని, కాకపోతే  వాటితో మ్యాచ్‌ని నేను  ఆస్వాదించాను. అని అలాగే భారత్ కి కూడా బౌలింగ్ చేయడం అంత సులభం అని నేనో అనుకో నని కాకపోతే అనేక సార్లు భారత్ పై కూడా విజయం సాధించాం.

ఢిల్లీ, కేప్ టౌన్, కోల్ కత్తా ఫేవరెట్ గ్రౌండ్స్ అంటే ఇష్టం. ముఖ్యంగా కోల్‌కత్తాలో ఆడటాన్ని చాలా ఆనందించాను. 

జాత్యహంకారం లేదా హూటింగ్ వంటి సంఘటనలు తనకు ఎప్పుడూ ఎదురు కాలేదని కాకపోతే కోల్‌కత్తా‌లో సచిన్ రనౌట్ అయినప్పుడు అభిమానులు అపార్ధం చేసుకున్నారు. 

నేను ఎప్పుడూ టెస్ట్ క్రికెట్ ఆడాలనే అనుకున్నాను. 300 వికెట్లు తీసుకోవాలనుకున్నాను. కానీ నా మోకాళ్ళ సహకరించక పోవడంతో దానిని సాధించలేకపోయాను. 

నా అభిప్రాయం ప్రకారం, భారతదేశపు ఉత్తమ కెప్టెన్ అంటే ఎప్పటికి గంగూలీ. ధోని కూడా బాగానే ఆడాడు. కానీ నాకు మాత్రం గంగూలీ అంటే ప్రత్యేకమైన అభిమానం.

మేము 1999 నుండి భారత్‌తో చాలా మ్యాచ్‌లు గెలిచాం. కానీ, 2004 లో భారతదేశం సౌరవ్ గంగూలీ కెప్టెన్సీలోకి వచ్చినప్పుడు ఇండియా వేరే జట్టును చూసింది. బెంగాలీలు అద్భుతమైన క్రికెటర్లు. బెంగాలీలు ఎప్పుడూ ధైర్యంగా, బలంగా ఉంటారు. గంగూలీ తెలివైన వ్యక్తి మాత్రమె కాదు చాలా మంచి వ్యక్తి.

నన్ను ఇబ్బందులు ఎప్పుడు వదిలిపెట్టలేదు. సుమారు 6 సంవత్సరాలు వరకు నడవలేకపోయాను. 1998-99 నేను బాధపడని సంవత్సరం, ఎందుకంటే ఆ ఏడాది నేను చాలా వికెట్లు తీసుకున్నాను.

చిన్నప్పుడు కొన్నిసార్లు  బస్సు పైకప్పు పై వెళ్ళేవాడిని, లేకపోతే  నడిచి క్రికెట్ ట్రైనింగ్ కి వెళ్ళేవాడిని ఆ తర్వాత సైకిల్ తీసుకున్నాను.

‘రెడీ’ చిత్రం షూటింగ్ సందర్భంగా సల్మాన్‌ను కలిశాను. అప్పుడు సల్మాన్ నాకు చెప్పారు - మా ఇద్దరినీ కొట్టడం కష్టమని మమ్మల్ని ఎవరు ఏం చేసినా, మేము ఏదో విధంగా పైకి వస్తామని. సల్మాన్ తన దబాంగ్, వాంటెడ్  సినిమాలని అందుకు ఉదాహరణలు. 

సల్మాన్ ఖాన్ రాయిని తాకితే అది వజ్రం అవుతుంది అని, నేను మరియు సల్మాన్ ఇద్దరం ఫీనిక్స్ లాంటివాళ్లం. 

2005 ఆస్ట్రేలియా సిరీస్‌లో కొంతమంది పొరబాటున తనపై అత్యాచార ఆరోపణలు పెట్టారు. ఆ తరువాత అది పాకిస్తాన్ జట్టుకు చెందిన మరొక అబ్బాయి అని తెలిసి కేసు విరమించుకున్నారు. దానికి కారణం పాక్ జట్టు యాజమాన్యం ఆ బాలుడిని దాచిపెట్టింది. నేను అబ్బాయి పేరు చెప్పను కాని అందులో నేను లేనని మాత్రం చెప్పగలను. అయితే ఈ లోపే మీడియా నన్ను అనుమానించింది. 

నా కెరీర్ మొత్తం మీద, ఛైర్మన్ నన్ను చాలా గౌరవించారు, నేను ఎవరికీ ఎప్పుడూ వ్యక్తిగత హాని కలిగించలేదు. పాక్ జట్టు నుండి ఎవరినీ బహిష్కరించమని  కోరలేదు. ప్రజలు అఫ్రిదిని ఇష్టపడితే, నాకు నచ్చింది. కానీ నా ఫ్యాన్ ఫాలోయింగ్ ప్రపంచవ్యాప్తంగా ఉందని ఆయన నాకు చెప్పేవారు.

తనకు కోపం ఎక్కువ కాబట్టి కొంత మందితో గొడవ పడ్డానని.. ఒకసారి యానిస్ ఖాన్‌తో కూడా గొడవ పడ్డానని అక్తర్ అన్నాడు. పాకిస్తాన్ వారితో కలిపి 11 ఉత్తమ వన్డే మ్యాచ్ కి సెలెక్ట్ చెయ్యవలసి వస్తే అక్రమ్, వకార్ యూనిస్ వంటి వారు బౌలింగ్ కి తీసుకుంటాను.  

ఇక, బ్యాటింగ్‌లో అయితే సచిన్ టెండూల్కర్, అన్వర్, ఇంజామామ్ ఉల్ హక్, రాహుల్ ద్రవిడ్, వీరేంద్ర సెహ్వాగ్, అబ్దుల్ రజాక్, యువరాజ్ సింగ్ వంటి వారిని తీసుకుంటానని షోయాబ్ చెప్పాడు.

For All Tech Queries Please Click Here..!
Topics: