కోహ్లీ ప్రయోగాలపై మండిపడ్డ కైఫ్

Sunday, May 17, 2020 11:28 AM Sports
కోహ్లీ ప్రయోగాలపై మండిపడ్డ కైఫ్

జట్టు ఎంపికపై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ చాలా ప్రయోగాలు చేస్తున్నాడని, అతను అలా చేయకూడదని భారత మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ అన్నాడు. కొన్ని మ్యాచ్‌లలో ఆటగాడు తన ఫాంను కోల్పోతే, కోహ్లీ అతనికి మద్దతు ఇవ్వాలని అన్నారు.  

శనివారం Heloలో లైవ్‌లో అభిమానులతో మాట్లాడాడు. ఈ సందర్భంగా పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు. క్రికెట్లో టెస్టు ఫార్మాట్ తనకిష్టమైన ఫార్మాట్ అని తెలిపాడు. కోహ్లీ సైతం టెస్టు క్రికెట్‌నే ఇష్టపడతాడన్నాడు. 

వికెట్ కీపర్ పంత్ గురించి కైఫ్ మాట్లాడుతూ టీమిండియాకు శాశ్వత స్పెషలిస్ట్ వికెట్ కీపర్ అవసరం. కెఎల్ రాహుల్ బ్యాకప్ వికెట్ కీపర్ కావచ్చు. కానీ అతను ప్రధాన వికెట్ కీపర్‌గా ఉండాలని అనుకోడని కైఫ్ తెలిపాడు. 

పంత్‌ను పూర్తి వికెట్ కీపర్ గా మద్దతు ఇవ్వాలనుకుంటే, కోహ్లీ అతనికి అండగా నిలవాలని సూచించాడు. అంతే కానీ అతడిని టీమ్ సభ్యులకు నీళ్లబాటిళ్లు, ఆహారం ఇవ్వడానికి జట్టులో లేడనేది గుర్తుంచుకోవాలని అన్నాడు. 

కోహ్లీ రిటైర్మెంట్ నాటికి మోస్ట్ సక్సెస్ ఫుల్ కెప్టెన్ అవుతాడని కైఫ్ చెప్పాడు. లార్డ్స్ టెస్టులో విజయం సాధిస్తే తప్పకుండా షర్టు తొలగించి సంబరాలు చేసుకోవాలని అప్పటి కెప్టెన్ గంగూలీ ముందుగానే ప్లాన్ చేశాడని కైఫ్ చెప్పాడు.

ఇప్పటి వరకు టీమిండియాలో బెస్ట్ ఫినిషర్ ఎవరు అని అడగ్గా... ధోనీ అని బదులిచ్చాడు. విరాట్ కోహ్లీ బెస్ట్ ఇండియన్ కెప్టెన్ అని కితాబిచ్చాడు. ప్రస్తుతం టీమిండియాలో నాలుగో స్థానానికి శ్రేయస్ అయ్యర్ సరిపోతాడని చెప్పాడు.

సెలెక్టర్ల తీరుపై కైఫ్ మండిపడ్డాడు. జట్టు నుంచి తప్పుకున్న ఆటగాళ్లతో సెలక్షన్ కమిటీ, టీమ్ కోచ్ లేదా కెప్టెన్ మాట్లాడాలని చెప్పాడు. ప్రతి క్రీడాకారుడు దేశం కోసం ఆడుతున్నాడని... ప్రతి ఒక్కరికీ చెడు సమయం అనేది ఉంటుందని...  మేనేజ్‌మెంట్ వారిని జట్టు నుండి ఎందుకు మినహాయించిందనే దాని గురించి కనీసం సమాచారం ఇవ్వాలని అన్నాడు.

For All Tech Queries Please Click Here..!
Topics: