షోయబ్ అక్తర్ ప్రపంచ రికార్డును భారత పేసర్ ఉమేశ్ యాదవ్ బద్దలు కొడతాడు..

Sunday, May 10, 2020 02:24 PM Sports
షోయబ్ అక్తర్ ప్రపంచ రికార్డును భారత పేసర్ ఉమేశ్ యాదవ్ బద్దలు కొడతాడు..

పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ నెలకొల్పిన ప్రపంచ రికార్డును భారత పేసర్ ఉమేశ్ యాదవ్ బద్దలు కొడతాడని టీమిండియా క్రికెటర్ శ్రీశాంత్ తెలిపాడు. 2003 ప్రపంచకప్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో అక్తర్ 161.3 కేపీహెచ్ వేగంతో బంతిని వేసి అత్యంత వేగవంతమైన పేసర్‌గా రికార్డు నెలకొల్పిన సంగతి తెలిసిందే.

శుక్రవారం హలో యాప్‌కి ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ఈ సందర్భంగా అక్తర్ ఫాస్టెస్ట్ రికార్డును భారత బౌలర్లు అధిగమిస్తారా? అని ఓ అభిమాని ప్రశ్నించాడు. దీనికి ఉమేశ్ యాదవ్‌ ఆ రికార్డును అధిగమించవచ్చని ఈ కేరళ స్పీడ్ స్టార్ సమాధానమిచ్చాడు.

"షోయబ్ ఫాస్టెస్ట్ రికార్డును ఉమేశ్ యాదవ్ అధిగమించవచ్చు. ఇప్పటికే బ్యాటింగ్ రికార్డులన్నీ బద్దలయ్యాయి. అఫ్రిది ఫాస్టెస్ట్ సెంచరీని అధిగమించారు. అక్తర్ 161.3 కేపీహెచ్ ఫాస్టెస్ ఘనత కూడా బ్రేక్ చేస్తారు. జస్‌ప్రీత్ బుమ్రాకు కూడా అవకాశం ఉంది. అతను ఇప్పటికే 155 కేపీహెచ్ స్పీడ్‌తో బంతులు వేస్తాడు. లేకుంటే ఉమేశ్ సాధిస్తాడు. ప్రతీ బంతిని వేగంగా వేయాల్సిన అవసరం లేదు. 137-145 కేపీహెచ్ స్పీడ్‌ మధ్య బంతిని స్వింగ్ చేస్తే సరిపోతుంది. లేకుంటే ఆటగాళ్లు గాయపడుతారు" అని శ్రీశాంత్ చెప్పుకొచ్చాడు. 

ఇక బౌలర్లు ప్రారంభంలో వేసే బంతుల్లో ఉండే వేగం తర్వాత ఎందుకు ఉండదని మరో అభిమాని ప్రశ్నకు "బౌలర్ల వేగం తగ్గడంపై మ్యాచ్ పరిస్థితులు, ఆటగాళ్ల ఫిట్‌నెస్ ఆధారపడి ఉంటుంది. నాకు సర్జరీ జరిగిన తర్వాత వైద్యులు 3-5 ఓవర్లే బౌలింగ్ చేయాలన్నారు. కానీ నేను 10 ఓవర్లకుపైగానే బౌలింగ్ చేసేవాడిని'అని తెలిపాడు. 

అప్పటి ఇప్పటికీ ఆటగాళ్ల దూకుడులో ఏమైనా తేడా ఉందా? అని ప్రశ్నించగా.. అప్పట్లో వసీం, పాట్రిక్, యూనిస్, షోయబ్ అక్తర్ చాలా దూకుడుగా ఉండేవారు. ఓ మోటోతో బౌలింగ్ చేసేవారు. పరుగులు సమర్పించుకున్నా.. వికెట్ తీసినా వారి దూకుడులో మాత్రం తేడా ఉండేది కాదు. భారత్‌లో అప్పడు జవగల్ శ్రీనాధ్ ఉండగా.. ఇప్పుడు బుమ్రా ఉన్నాడు.

"రాట్ గొప్ప విలువలు కలిగినవాడు. అతను, కుల్దీప్ చాలా దూకుడైన ఆటగాళ్లు. కానీ నేను మాత్రం కుంబ్లే శైలిని అనుసరిస్తా. దూకుడును అదుపులో పెట్టుకోవడం కూడా చాలా ముఖ్యం. క్రికెట్ అనేది తమకు ఆట మాత్రమే కాదు. మా జీవితం. ఆటపై ప్యాషన్ ఉన్నప్పుడు దూకుడు ఉండటం సాధారణమే" అని శ్రీశాంత్ అన్నాడు. 

ప్రస్తుతం ఇషాంత్ శర్మ, జస్‌ప్రీత్ బుమ్రా తన ఫేవరేట్ బౌలర్లని శ్రీశాంత్ తెలిపాడు. ఉమేశ్ యాదవ్, షమీ కూడా అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నారని శ్రీశాంత్ కొనియాడాడు.

For All Tech Queries Please Click Here..!
Topics: