పుట్టుకతోనే నిమ్మగడ్డ ఎన్నికల కమిషనర్‌గా ఫీలవుతున్నారు : మంత్రి సీదిరి అప్పలరాజు 

Sunday, March 7, 2021 04:15 PM Politics
పుట్టుకతోనే నిమ్మగడ్డ ఎన్నికల కమిషనర్‌గా ఫీలవుతున్నారు : మంత్రి సీదిరి అప్పలరాజు 

Amaravati, Jan 9: ఏపీ SEC నిమ్మగడ్డ పుట్టుకతోనే ఎన్నికల కమిషనర్‌గా ఫీలవుతున్నాడని మంత్రి డాక్టర్‌ సీదిరి అప్పలరాజు అన్నారు. పలాసలో మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. 2018లో ఎన్నికలు నిర్వహించమని హైకోర్టు చెప్పింది. అయితే ఆ రోజున ఎన్నికలు ఎందుకు నిర్వహించలేదు. చంద్రబాబుపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత వల్ల నిమ్మగడ్డ ఆ రోజు ఎన్నికలు నిర్వహించలేదు. అది కోర్టు ధిక్కారం కాదా..? అని నిమ్మగడ్డను ప్రశ్నిస్తున్నా. రాష్ట్రంలో ఒక కేసు ఉన్నప్పుడు కరోనాను సాకుగా చూపించి నిమ్మగడ్డ స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేశారు.

ఇప్పుడు కరోనా స్ట్రైయిన్‌ వ్యాప్తి చెందుతున్న తరుణంలో ప్రజలు అభద్రతా భావంతో ఉన్నారు. మరోవైపు వ్యాక్సిన్‌ సరఫరా దేశవ్యాప్తంగా మొదలైంది. ఇలాంటి తరుణంలో ఎన్నికల కమిషనర్‌కు ఎందుకంత ఆత్రుత. ఎన్నికలు నిర్వహిస్తే... నీకు, నీ యజమానికి వచ్చే లాభం ఏంటి?. ఒక రాజకీయ దురుద్దేశంతో పని చేస్తున్న నువ్వా మాకు ఎన్నికల కమిషనర్. హోటళ్లలో కూర్చుని రాజకీయాలు చేసే నిమ్మగడ్డకు ఎన్నికల కమిషనర్‌గా అర్హత లేదు' అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు

For All Tech Queries Please Click Here..!