ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఎన్నికల ప్రక్రియ రద్దు కు ఛాన్స్.? మూడు నెలల తరువాతే:ఏం జరుగుతోంది.!

Thursday, March 19, 2020 11:27 AM Politics
ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఎన్నికల ప్రక్రియ రద్దు కు ఛాన్స్.? మూడు నెలల తరువాతే:ఏం జరుగుతోంది.!

స్థానిక సంస్థల ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల సంఘం వాయిదా వేసింది. తొలుత ఆరు వారాల పాటు వాయిదా,ఆ తరువాత కరోనా పరిస్థితిని సమీక్షించి నిర్ణయం తీసుకుంటామని ప్రకటించింది. అయితే, దీనిని అంగీకరించటానికి సిద్దంగా లేని ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. అయితే, అక్కడా ఎన్నికల సంఘానికి మద్దతుగా తీర్పు వచ్చింది.అయితే,ఎన్నికల సంఘం కోడ్ అమల్లో ఉంటుందని ఇచ్చిన ఆదేశాలను మాత్రం సుప్రీం కోర్టు రద్దు చేసింది. ఫలితంగా కోడ్ సడలించారు. అయితే, అక్కడే చిక్కుముడి ఏర్పడింది. ఇప్పుడు దేశం మొత్తంగా కరోనా స్టేజ్ 2 కంటిన్యూ అవుతోంది.

రానున్న రోజులు మరింత కీలమని చెబుతున్నారు. దీంతో,అసలు ఎన్నికలు ఆరు వారాల్లో సాధ్యమేనా,కోడ్ సడలించిన తరువాత ఇప్పటికే దాఖలైన నామినేషన్లు లైవ్ లో ఉంటాయా. తాజాగా నిపుణులు వ్యక్తం చేస్తున్న సందేహాలు, కోర్టులో దాఖలైన కేసులు చూస్తుంటే,ఎన్నికల షెడ్యూల్ సైతం రద్దు చేసి,రీ షెడ్యూల్ చేయాల్సి ఉంటుందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే, దీని పైన ఎన్నికల సంఘం మాత్రమే తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.

For All Tech Queries Please Click Here..!