చంద్రబాబు రాజ్యసభ ఎన్నికల ఎత్తుగడ వెనక రహస్యం..!

Saturday, June 20, 2020 07:53 AM Politics
చంద్రబాబు రాజ్యసభ ఎన్నికల ఎత్తుగడ వెనక రహస్యం..!

గతంలో పార్లమెంటులో కమ్యూనిస్టులు,ఇతర చిల్లర పార్టీలు అప్పుడప్పుడూ అవిశ్వాసతీర్మాణం ప్రవేశ పెట్టేవారు!పట్టుమని నాలుగు పుంజీలమంది సభ్యులతో అవిశ్వాసతీర్మానం ఏమిటయ్యా అంటే, వారి సభ్యులు కరెక్టుగా ఉన్నారా,లేక ఎవరైనా జారిపోయారా అనితెలుసుకునేందుకు అని పార్లమెంటు లాబీల్లో జోకులు పేలేవి!

ఈరోజు జరిగిన రాష్ట్రం నుండి రాజ్యసభ సభ్యుల ఎన్నిక విషయానికి వస్తే , బాబు చేసిన పనిపై కూడా జనం ఇదే రీతిలో నవ్వుకుంటున్నారు ! 23 మందిలో ముగ్గురు జారిపోయి,కొందరు గోడెక్కి కూచున్నారన్న రూమర్లు ఉన్నపరిస్తితుల్లో, పోటీ పెట్టడం,అదీ గతంలో నెగ్గే సీట్ల విషయంలో మోత్కుపల్లి నరసింహులు,జయరాజ్,వర్ల రామయ్య వంటి దళితవర్గనేతలు ఏనాడు గుర్తు రానిది,ఓడిపోయే సీటుకు మాత్రం వర్లరామయ్యబలిపశువుఅయ్యాడు!

గతంలో ఒకసారి సీటిచ్చామని చెప్పి వర్లకు చెప్పడం
తో,కుటుంబసభ్యులతో బాబుకు కృతజ్ఞతలు చెప్పేందుకు హడావుడిగా కార్లలో బయలుదేరిన వర్లరామయ్య కృష్ణ బేరేజ్ వద్దకు వచ్చేటప్పటికే,తన సీటు మార్చిన చావుకబురు చల్లగా ఫోన్లోచెప్పడంతో,
దిగాలు ముఖంతో తిరిగి వెళ్ళిపోయాడు!

తన సామాజిక వర్గo వారిని రెండేసి సార్లురాజ్యసభ
కు పంపిన బాబుకు ,నాడు దళితులసలు కనబడ
లేదు!

ఐతే తన కులం వారు గరికపాటి మోహన రావు,కంభంపాటి రామ్మోహన్ రావు,సుజనా చౌదరి,సీఎం రమేష్,వంటివారు,లేదంటే దండిగా కోట్లు సమర్పించుకున్న దేవేందర్ గౌడ్,జీకే వెంకటేష్,సీతామహాలక్ష్మి వంటి వారిని మాత్రమే రాజ్యసభకు పంపాడు చంద్రబాబు !

ప్రస్తుతం కరోనా సమయంలో అసెంబ్లీ ఎందుకు అని ప్రశ్నించిన బాబు,గాలికి పోయే పేలాలు కృష్ణార్పణం అన్నట్లు, గెలవని సీటుకు దళిత రంగు పూసి,వారి సానుభూతి పొందుదామన్న దుర్భిద్ధితో పెట్టిన పోటీతో  కరోనాలో కూడా ఎన్నిక తంతు జరప వలసి వచ్చింది!

ఐతే బాబు కుహానా ఎత్తుగడ బూమరాంగ్ అయి, టీడీపీ అభ్యర్థి వర్లకు 17 ఓట్లే రావడంతో, నైతికంగా చూస్తే తన ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయినట్ల
య్యింది! చివరకు వ్రతం చెడినా ఫలితం దక్కని పరిస్థితి అయ్యింది పచ్చపార్టీకి !

అందుకే అంటారు అనువుగాని చోట అధికులమన
రాదని!

For All Tech Queries Please Click Here..!
Topics: