మోడీ భారత జాతిపిత : ట్రంప్

Wednesday, September 25, 2019 11:59 AM Politics
మోడీ భారత జాతిపిత : ట్రంప్

అమెరికా అధ్యక్షుడుడోనాల్డ్ ట్రంప్‌. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై పొగడ్తల వర్షం కురిపించారు. మోడీని భారత జాతిపితగా అభివర్ణిస్తూ సంచలన ప్రశంసలు చేశారు. న్యూయార్క్‌లో ఐక్యరాజ్యసమితి సాధారణ సమావేశాలకు హాజరయ్యేందుకు వెళ్లిన ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వాణిజ్య ఒప్పందాలపై చర్చలు జరిపారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ హౌడీ మోడీ సభకు వచ్చినందుకు ట్రంప్‌కు మోడీ కృతజ్ఞతలు తెలిపారు.

ట్రంప్ తనకు మంచి మిత్రుడని మోడీ అన్నారు. త్వరలోనే రెండు దేశాలు మరో వాణిజ్య ఒప్పందం చేసుకోంటాయని తెలిపారు. దాంతో భారత్, అమెరికా మధ్య వాణిజ్యం 60 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అన్నారు. ట్రంప్‌తో సహృద్భావ వాతావరణంలో చర్చలు జరిగాయని వెల్లడించారు. పొరుగుదేశమైన పాకిస్తాన్ అంశంపై కూడా చర్చించారు. చర్చలకు తాము విముఖం కాదని మోడీ స్పష్టం చేశారు. ఉగ్రవాదం నుంచి భారత్ ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఆయన వివరించారు. కాశ్మీర్‌లో ఉగ్రవాదుల చర్యల వల్ల గత 30 ఏళ్లలో 42 వేల మంది బలయ్యారని ట్రంప్ దృష్టికి తీసుకొచ్చారు. 

For All Tech Queries Please Click Here..!
Topics: