చంద్రబాబు స్వార్థానికి బలయ్యాం!

Friday, January 24, 2020 11:44 AM Politics
చంద్రబాబు స్వార్థానికి బలయ్యాం!

శాసన మండలిలో పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లుల విషయంలో చంద్రబాబును నమ్మి మోసపోయాయని, కొరివితో తలగొక్కున్నట్లైందని టీడీపీ సభ్యులు వాపోతున్నారు. చైర్మన్‌ను అడ్డుపెట్టుకుని బిల్లులు చట్టరూపం దాల్చకుండా తాత్కాలికంగా అడ్డుకుని. తమ పదవులకే ఎసరు తెచ్చుకున్నామని ఆందోళన చెందుతున్నారు. మండలిని రద్దు చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేయడంతో టీడీపీ ఎమ్మెల్సీలు  అంతర్మథనంలో పడ్డారు. తమ రాజకీయ భవిష్యత్తు అంధకారమయ్యే పరిస్థితి ఏర్పడిందని. అందుకు చంద్రబాబే కారణమని లోలోన రగిలిపోతున్నారు.  

మండలిలో టీడీపీ సభ్యుల సంఖ్య 34 కాగా. చైర్మన్, డిప్యూటీ చైర్మన్‌లు ఆ పార్టీకి చెందిన వారే. మండలి రద్దయితే ఎక్కువగా నష్టపోయేది టీడీపీనే. మండలిలో ఈ రెండు బిల్లుల్ని అడ్డుకునేందుకు బాబు, లోకేష్, యనమల మంత్రాంగం నడుపుతున్న సమయంలోనే పలువురు టీడీపీ సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు. బిల్లులను కొద్దిరోజులు అడ్డుకోవడం వల్ల ఒరిగేదేమీ ఉండదని.. కొంత ఆలస్యమైనా ప్రభుత్వం తన నిర్ణయాన్ని అమలు చేస్తుందని చెప్పారు. చట్టవిరుద్ధంగా వ్యవహరించి అప్రదిష్ట మూటగట్టుకోవాల్సివచి్చందని పలువురు టీడీపీ ఎమ్మెల్సీలు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు.

ఈ క్రమంలోనే పార్టీ విప్‌ను ధిక్కరించి పోతుల సునీత, శివనాథరెడ్డిలు ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేశారు. కొందరు యనమల వద్ద  అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే చంద్రబాబు, లోకే‹Ùల రాజకీయాల వల్ల పైకి మాట్లాడలేక పోయారు. రాజకీయ ప్రయోజనాల కోసం చంద్రబాబు తమ భవిష్యత్తును పణంగా పెట్టారని రాయలసీమ ప్రాంతానికి చెందిన ఒక ఎమ్మెల్సీ ఆవేదన వ్యక్తం చేశారు. తాత్కాలిక రాజకీయ అవసరాల కోసం తమ పదవులకు ఎసరు తెచ్చే పరిస్థితి తీసుకొచ్చారని మరికొందరు వాపోతున్నారు. శాసనమండలి రద్దు దిశగా అడుగులు పడుతుండడంతో ఏం చేయాలో తెలియక విలవిల్లాడుతున్నారు.

For All Tech Queries Please Click Here..!
Topics: