ఏపీలో సంపూర్ణ మద్య నిషేధం దిశగా మరో విప్లవాత్మక అడుగు

Friday, May 15, 2020 12:25 PM Politics
ఏపీలో సంపూర్ణ మద్య నిషేధం దిశగా మరో విప్లవాత్మక అడుగు

రాష్ట్రంలో సంపూర్ణ మద్యపాన నిషేధం దిశగా జగన్ ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. మద్యపాన నిషేధాన్ని అమలు చేసిన అనంతరం రాష్ట్రంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనే విషయాన్ని ప్రభుత్వం ముందుగానే అంచనా వేసింది. అక్రమ మద్యం ప్రవాహంలా ముంచెత్తే ప్రమాదం ఉందని భావిస్తోంది. అలాంటి పరిస్థితులు ఖచ్చితంగా తలెత్తి తీరుతాయనే నిర్ణయానికి వచ్చింది. అక్రమ మద్యం విక్రయాన్ని నిరోధించడం, అక్రమ మద్యం తయారీని అరికట్టడానికి విప్లవాత్మక చర్యలను తీసుకుంది.

అక్రమ మద్యాన్ని అరికట్టడానికి ప్రత్యేకంగా ఓ శాఖను ఏర్పాటు చేసింది. స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో పేరుతో కొత్త శాఖను సృష్టించింది. ఈ కొత్త శాఖలో ఆరువేల మందికి పైగా ఉద్యోగులను నియమించింది. మంజూరైన పోస్టులు, అదనపు కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు, జాయింట్ కమిషనర్లు, కానిస్టేబుళ్లు, హెడ్ కానిస్టేబుళ్లు, జూనియర్ అసిస్టెంట్లు, సీనియర్ అసిస్టెంట్లు, డ్రైవర్లు.. ఇలా మొత్తం 6274 మంది ఉద్యోగులు ఈ శాఖలో పనిచేస్తారు.

For All Tech Queries Please Click Here..!
Topics: