తెలంగాణ దొరకు జగన్ పట్ల అంత ప్రేమేందుకు, పూర్తి విశ్లేషణ.

Friday, May 22, 2020 05:28 PM Politics
తెలంగాణ దొరకు జగన్ పట్ల అంత ప్రేమేందుకు, పూర్తి విశ్లేషణ.

ఆంధ్రా CM YSజగన్మోహన్ రెడ్డి తో ఉన్న స్నేహ బంధమా? చంద్రబాబు రాజకీయంగా పునరజ్జీవుడు కాకూడదన్న ఆలోచనా? మరి తెలంగాణ ఉద్యమ కారుడు పోతిరెడ్డిపాడు విషయంలో ఎందుకు తల వంచాడు? ఇప్పుఫు ఇదే తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్.

వాస్తవానికి రాజకీయాల్లో శాశ్వత మిత్ర, శత్రుత్వాలనేవి ఉండవనేది అందరికి తెలిసిన సత్యం! మరి తన రాజకీయ ప్రయోజనాలకు విరుద్ధమైన తెలంగాణలోని బీజేపీ, కాంగ్రెస్ లకి విమర్శలు చేసే అవకాశాన్ని అనుభవజ్ఞుడు కేసీఆర్ చేజేతులా ఎందుకిస్తాడు? ఐతే ,మరి ఎందుకిచ్చాడు? అక్కడే ఉంది కేసీఆర్ రాజకీయచతురత, అతనిలోని అంతులేని నిఘాడ అనుభవం.

తెలంగాణ ప్రాంతంలో రెడ్డి సామాజిక వర్గం ఆంధ్రాలో కంటే ఎక్కువగా ఉండటమే గాక,ఆ సామాజికవర్గ ప్రభావం కూడా అక్కడి రాజకీయాల మీద ఎక్కువ. ఉమ్మడి రాష్ట్రంగా ఉండగా మహానేత వైస్సార్ సంక్షేమ పథకాలు,ఆయన చేపట్టిన చేవెళ్ల-ప్రాణహిత ప్రాజెక్ట్, హైదరాబాద్ నగరంలో రింగ్ రోడ్డు, స్పోర్ట్స్ కాంప్లెక్స్, మెట్రోరైల్ ప్రాజెక్ట్, రాజీవ్ గాంధీ ఇంటర్ నేషనల్ విమానాశ్రయం వంటి ఎన్నో లెక్కకు మించిన అభివృద్ధి పథకాలతో రాష్ట్రంలోని రెడ్డి సామాజిక వర్గంతో పాటు,బీసీ,ఎస్సీ,ఎస్టీ, మైనారిటీ వంటి బలహీనవర్గాలలో సైతం సుస్థిరస్థానాన్ని పొందారు.

వైస్సార్ అనంతరం ఆయన కుమారుడిగా జగన్ పట్ల కూడా వారందరికీ ఎంతో సానుభూతి ఉందన్నది జగన్ 16 నెలల జైలు జీవితం తర్వాత విడుదలై ఇంటికి వచ్చే సందర్భంలో కార్లు ,బైకులతో జనం జరిపిన అతి పెద్ద ర్యాలీనే సాక్ష్యం. అంతేకాక తెలంగాణకు తలమానికమైన రాజధాని హైద్రాబాద్,సికింద్రాబాద్ లలో కార్పొరేషన్ విజయావకాశాలు,నగర ఎమ్మెల్యేల తలరాతలు మార్చగల స్థితిలో అక్కడి ఆంధ్రా సెట్లర్లు ఉన్న విషయం వాస్తవం.

జంటనగరాలతోపాటు,తెలంగాణలోని నిజామాబాద్, ఖమ్మం, రంగారెడ్డి జిల్లాలతో పాటు, వరంగల్, జనగామ తదితర జిల్లాల్లో కూడా ఆయా గ్రామాలకు సమీపాల్లో గుంటూరు పల్లెలుగా అనాదిగా కొనసాగుతున్న ఊర్లలో ఆంధ్రాసెట్లర్లు అధికంగా నివసిస్తున్న విషయం కూడా కేసీఆర్ వంటి మేధావికి తెలియంది కాదు. ఇటువంటి స్థితిలో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ద్వారా వైస్సార్ మరణానంతరం అధికారంలోకి వచ్చిన కేసీఆర్ కు, ఉద్యమ వేడి చల్లారిన తరువాత కులాల ఈక్వేషన్లను పట్టించుకోకుండా, ఒకపక్క కాంగ్రెస్,మరోపక్క బీజేపీలను ఎదుర్కొంటూ రాజకీయం చేయడం అంత తేలికైన విషయం కాదు.

అందుకే మహానేత అభిమానులైన రెడ్డి సామాజిక వర్గ ఓటర్లతో పాటు,వైస్సార్ ను నేటికి అభిమానించే ఓటర్లను తనకనుకూలంగా ఉంచుకోవాలంటే జగన్ తో స్నేహం కొనసాగించక తప్పదు. అది స్నేహం అనేకంటే రాజకీయ ఎత్తుగడ గా చెప్పవచ్చు.

ఆంధ్ర రాష్ట్రంలో ఓటర్ల ఆలోచన ప్రభావం అక్కడి ఆంధ్రా సెట్లర్లపై ఎక్కువగా ఉంటుంది ఈ విషయం మొన్నటి సాధారణ ఎన్నికల్లో సైతం కూకట్ పల్లి,తదితర పలునియోజకవర్గాల్లో గతంలో బంపర్ మెజారిటీతో టీడీపీ పరమైన స్థానాలను సైతం జగన్ తో పొత్తు, పరోక్ష మద్దతులతోపాటు, బాబుపై కేసీఆర్ వ్యతిరేఖతల కారణంగా TRS మంచి మెజారిటీతో కైవసం చేసుకుందనేది కాదనలేని సత్యం.

అట్లే అంతకు ముందు జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో సైతం ఆంధ్రా సెట్లర్లు టీడీపీకి హ్యాండ్ ఇచ్చి, జగన్ పై ఉన్న అభిమానంతో మిత్రుడైన కేసీఆర్ పార్టీకి ఓట్లేసి గెలిపించిన విషయం కూడా కేసీఆర్ కు ఎరుకే అందుకే ఆ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ముందు తన కుమారుడైన మంత్రి కేటీఆర్ ను తాడేపల్లి పనిగట్టుకుని పంపి, ఏదో ప్రోజెక్టుల విషయమై చర్చల కోసం పంపినట్లు పంపి, జగన్ తన పక్షమే అనే సంకేతాన్ని అక్కడి వైస్సార్ అభిమానులకిచ్చి, తదనుగుణంగా వారి మద్దతునుకూడా ఎన్నికల్లో కేసీఆర్ పొందటం జరిగింది.

అంతేకాక ,జగన్ ఆ రాష్ట్రంలో పోటీ చేస్తే జగన్ చీల్చే ఓట్లప్రభావం కేసీఆర్ పార్టీపై ఉంటుందనేది కూడా సత్యమే. ఎలాగూ వైస్సార్ కాంగ్రెస్ తెలంగాణలో పోటీచేయదు కాబట్టి జగన్ తో మంచిగా ఉంటే వచ్చే నష్టం లేదు. పైగా లాభం పొందొచ్చు. కాంగ్రెస్ ,టీడీపీ వంటి పార్టీలను ధీటుగా ఎదుర్కోవచ్చు ఇదీ కేసీఆర్ వ్యూహం.

జగన్ తో స్నేహం వల్ల జగన్ కంటే కేసీఆర్ కే రాజకీయం గా ఎక్కువ లబ్ది చేకూరుతుంది. అదేవిధంగా విరోధంతో నష్టపోయేది కూడా తానే. కాబట్టి రాజకీయ అపరచాణిక్యుడైన కేసీఆర్ జగన్ సీఎంగా ఉన్నంత వరకూ ఆంధ్ర రాష్ట్రంతో సఖ్యతగా ఉండేందుకే ప్రయత్నిస్తాడు తప్ప,అనవసరంగా కయ్యానికి కాలు దువ్వి, తనరాష్ట్రంలో రాజకీయంగా లేని తలపోట్లు తెచ్చుకోడు గాక తెచ్చుకోడు.

For All Tech Queries Please Click Here..!
Topics: