జగనన్నా జరభద్రం, వాటి జోలికి వెళితే ఇంక అంతే..!

Sunday, February 2, 2020 04:39 PM Politics
జగనన్నా జరభద్రం, వాటి జోలికి వెళితే ఇంక అంతే..!

అర్హులకు ప్రభుత్వ పథకాల ఫలాలు అందాలి, అనర్హులకు అండకూడదు, వారిని ఏరి వెయ్యాలి, ఇంతవరకూ అందరూ ఏకీభవిస్తారు. అయితే ఆతొలగింపు అనేదే ఒక పెద్ద చిక్కుముడిగా మారి, అసలైన అగ్ని పరీక్ష అవుతుంది. జగన్ సర్కారు ఈ క్రింది విదంగా అనర్హులని గుర్తిస్తుంది. ఇది ఎంత వారికీ కరెక్ట్ జగన్ అన్న. 

1) కారు : సెకండ్స్ లో 30 వేలరూ.లకు కూడా కారు దొరుకుతుంది, పిల్లలు పెద్దయ్యాక బైక్ పై వెళ్లే అవకాశం లేక దిగువ మధ్య తరగతి వారు కూడా కారు కొనాల్సిన పరిస్థితి. అంతమాత్రాన ఆ కారును ధనికులు కొనే లక్షలాది రూ.ల విలాస వంతమైన కార్లతో పోల్చడం సరికాదు.

2)ఐటీ రిటర్న్స్ : ఇల్లు కట్టుకునే వ్యక్తి బ్యాంక్ లోన్ అడిగితె, ఐటీ రిటర్న్స్ అడుగుతారు. లోన్ కోసం నామ్ కే వాస్తేగా దాఖలు చేసే రిటర్న్స్ను కోటీశ్వరుల దాఖలు చేసే రిటర్న్స్ను ఒకే గాటన కట్టడం ఎంత వరకు సమంజసం?

3) కరెంట్ : 300 యూనిట్ల కరెంట్ వినియోగంతో వారు ధనికులనుకోవడం కూడా కరెక్ట్ కాదు. ఇప్పటికీ పల్లెల్లో ఉమ్మడి కుటుంబాల సంస్కృతి, ఒకే ఇల్లు ఉన్నప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో ఉమ్మడిగా జీవించవలసిన ఆవశ్యకత ఉన్న కుటుంబాలెన్నో.

4)భూములు : భూములున్న వారే ధనికులనుకుంటే, పల్లెల్లో 10 ఎకరాల భూమి విలువ పట్నంలో ఒక్క సైట్ విలువను సరిపోలదు. ఇక పంట పొలాల విషయంలో కూడా భూముల విలువల్లో ఒక్కో ప్రాంతానికి ఒక్కో ధర ఉంటుంది. భూమున్నవాడే ధనవంతుడనుకుంటే ,భూమి లేకుండా రిటర్న్స్ దాఖలు చేయని వాడు, ఎన్ని కోట్ల రూ.ల నగదున్నా పేదవాడే.

ఇలా చెప్పుకుంటూ పోతే , వ్యక్తుల ఆర్థికపరిస్తితి అంచనా వేయడంలో ఎన్నో తారతమ్యాలు,ఇబ్బందులు, అందుకే ఈ రేషన్ కార్డుల విషయంలో వేలు పెట్ట బోయి , చేయి కాలుతుందన్న భయంతో గమ్మునున్నారు గతంలో చాలా మంది నేతలు. అంతేకాక ,ప్రస్తుతం వాలంటీర్ల ద్వారా అనర్హులు ఏరివేతలో ఎక్కడ ఒక అర్హుడు కార్డ్ కోల్పోయినా దానిని పెద్దగా దుష్ప్రచారం సాగించేందుకు యెల్లో మీడియా గొట్టాలు, పచ్చ కరపత్ర కలాలు గోతికాడ నక్కల్లా కాచుకుని ఉన్నాయి. పది మంది అనర్హులు లబ్ది పొందినా పరవాలేదు కానీ, ఒక అర్హుడి కార్డ్ తొలగించడమన్నది సహజ న్యాయానికి విరుద్ధం. ఎక్కడైనా అర్హులు పొరబాటున తొలగించబడితే, వారికి తిరిగి అర్హత కల్పించాలి.

ఇప్పుడే ఈ తొలగింపు ప్రక్రియను ఆరు నూరైనా అరకొర విధానాలతో అమలు చేస్తామంటే, భవిష్యత్తులో అధికారపార్టీకి చిక్కులు తప్పవు. ఓరకంగా చెప్పాలంటే అధికారపార్టీకి అది ఆత్మహత్యా సదృశ్యమే అవుతుంది. గనన్నా జరభద్రం.

For All Tech Queries Please Click Here..!
Topics: