కరోనా బ్రేకింగ్: దేశ ప్రజలకు చల్లటి శుభవార్త చెప్పిన ప్రధాని మోదీ!

Thursday, March 26, 2020 12:49 PM Politics
కరోనా బ్రేకింగ్: దేశ ప్రజలకు చల్లటి శుభవార్త చెప్పిన ప్రధాని మోదీ!

కరోనా వైరస్ కారణంగా సంక్షోభం, దేశమంతా 21 రోజులు లాక్‌డౌన్‌తో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేదలను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు మొదలు పెట్టింది. తక్కువ ఆదాయం ఉన్న కుటుంబాలకు కిలో బియ్యం రూ.3, కిలో గోధుమలు రూ.2 కే అందించాలని నిర్ణయించింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఫుడ్ సెక్యూరిటీ స్కీమ్‌కు కేంద్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. పేద కుటుంబాలను ఆదుకునేందుకు మూడు నెలల పాటు ఈ సబ్సిడీ ధరలకే బియ్యం, గోధుమలను అందిస్తామని కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ తెలిపారు. దినసరి కూలీలు, ఉద్యోగాలు కోల్పోయినవారికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం మేలు చేయనుంది. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌తో అనేక సంస్థలు ఏప్రిల్ 21 వరకు తెరుచుకునే అవకాశం లేదు.

దీంతో దినసరి కూలీలు, చిరుద్యోగులకు ఇబ్బందులు తప్పవు. కూలీ చేస్తే తప్ప పూటగడవని పేద కుటుంబాలు కోట్లల్లో ఉంటాయి. వారిని ఆదుకోవడం కోసం కేంద్ర ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది. 80 కోట్ల మందికి నెలకు 7 కిలోల రేషన్ అందించాలని నిర్ణయించింది. రూ.27 ధర గల గోధుమల్ని రూ.2 కే అందించాలని, రూ.37 కిలో గల బియ్యాన్ని రూ.3 కే ఇవ్వాలని నిర్ణయించింది.

For All Tech Queries Please Click Here..!
Topics: