Makkal Sevai Katchi: రజనీకాంత్ పార్టీ పేరు మక్కల్‌ సేవై కర్చీ, ఎన్నికల గుర్తు ఆటో..

Tuesday, February 2, 2021 02:00 PM Politics
Makkal Sevai Katchi: రజనీకాంత్ పార్టీ పేరు మక్కల్‌ సేవై కర్చీ, ఎన్నికల గుర్తు ఆటో..

Chennai, Dec 15: తమిళనాడులో వచ్చే ఏడాది మే నెలలో జరిగే అసెంబ్లీ ఎన్నికల (Tamilnadu elections 2021) బరిలో దిగేందుకు సూపర్ స్టార్ రజనీకాంత్ రెడీ అవుతున్నారు. డిసెంబర్‌ 31న పార్టీ పేరు… జనవరి ఒకటిన పూర్తి వివరాలు వెల్లడిస్తానంటూ ఇప్పటికే సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రకటించిన విషయం తెలిసిందే. పార్టీ పేరు, చిహ్నంపై ( Rajinikanth Party Symbol) తలైవా ఇప్పటికే తీవ్ర కసరత్తు జరిపారు.

కాగా రజనీకాంత్ పార్టీ పేరును మక్కల్‌ సేవై కర్చీగా(ప్రజా సేవా పార్టీ) (Makkal Sevai Katchi) రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నట్లు తెలుస్తోంది. అలాగే పార్టీకి గుర్తుగా ఆటోను (autorickshaw) కేటాయించినట్లు సమాచారం. ఈ మేరకు రజినీకాంత్ కేంద్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం అధికారులకు ప్రతిపాదనలను పంపించినట్లు తమిళ మీడియా వెల్లడించింది. 

కేంద్ర ఎన్నికల కమిషన్ ( Election Commission of India) ఈ ప్రతిపాదనలను ఆమోదించాల్సి ఉందని రజనీ సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇందులో మార్పులు చేర్పులు చోటు చేసుకోవడానికి అవకాశాలు ఉండొచ్చని సమాచారం. పార్టీ గుర్తుగా సైకిల్‌ గుర్తును కేటాయించినట్లు గతంలో ఊహాగానాలు వచ్చినప్పటికీ చివరికి ఆటో గుర్తు ఖారారైనట్లు తెలుస్తోంది. 

తన సినీ కెరీర్‌ను మలుపు తిప్పిన బాషా సినిమాలో (Baba logo) ఆటో డ్రైవర్ క్యారెక్టర్‌నే పొలిటికల్ కెరీర్ గా కూడా వాడుకునేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో  రజనీ పార్టీ (Rajinikanth Party) మొత్తం 234 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేయనున్నట్లు సమాచారం. దీనిపై అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది. 

ఇదివరకు రజినీకాంత్ తన పేరు మీద పార్టీని రిజిస్ట్రేషన్ చేయించారు. రజినీ మక్కల్ మండ్రం పేరు మీద పార్టీ రిజిస్టర్ అయింది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టినట్లుగా మీడియాలో వస్తున్న కథనాలు చెబుతున్నాయి రజినీ మక్కల్ మండ్రం పేరుకు బదులుగా మక్కల్ సేవై కచ్చి పేరును ఖరారు చేయాలని ఈసీకి ప్రతిపాదనలను పంపించారు. తొలుత రజినీకాంత్ తన పార్టీ పేరును మక్కల్ శక్తి కజగంగా నిర్ధారించాలని రెండు నెలల క్రితమే భావించారు. ఈ పేరును అనుమతించాలని ఆయన కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ప్రతిపాదనలను పంపించారు.

ఇది ఈసీలో అనైతింధియ మక్కల్ శక్తి కజగంగా 237 నంబరుతో నమోదైంది కూడా. అయితే ఈసీ దీనిని తిరస్కరించినట్లు తమిళ మీడియా చెబుతోంది. అలాగే- `బాబా ముద్ర`ను ఎన్నికల గుర్తుగా వినియోగించుకోవడానికి అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేయగా.. నిబంధనల ప్రకారం ఈసీ దీనికి అంగీకరించలేదని పేర్కొంది. .బాబా ముద్రకు బదులుగా ఆటోను కేటాయించినట్లు పేర్కొంది. ఇప్పుడు బయటకు వచ్చిన ఆటో గుర్తును పార్టీ పేరును సెప్టెంబర్ 30న ఎన్నికల కమిషన్ 237 నంబర్ గా ఎంట్రీ చేసినట్లుగా తమిళ మీడియా కథనం.  వచ్చే ఏడాది మే నెలలో 234 అసెంబ్లీ స్థానాలకు తమిళనాడులో ఎన్నికలు జరగనున్నాయి. 

For All Tech Queries Please Click Here..!