కుక్కల్లా తరిమేశారు, వాళ్లు డేంజర్ గాళ్లన్న కేటీఆర్

Thursday, April 2, 2020 04:13 PM Politics
కుక్కల్లా తరిమేశారు, వాళ్లు డేంజర్ గాళ్లన్న కేటీఆర్

ఢిల్లీ మర్కజ్ ద్వారా వేలమందికి వైరస్ సోకింది. తెలుగురాష్ట్రాల్లో ఆ ప్రభావం మరింత తీవ్రంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ నుంచి 1085 మంది, తెలంగాణ నుంచి 1030 మంది ఢిల్లీకి వెళ్లొచ్చినట్లు ఉన్న సమాచారంతో రెండురాష్ట్రాల ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. గత రెండ్రోజుల వ్యవధిలోనే ఇక్కడ పాజిటివ్ కేసుల సంఖ్య, మరణాలు అమాంతం పెరిగాయి. ఇదంతా ఒక ఎత్తైతే, పాజిటివ్ పేషెంట్లు కొందరు ట్రీట్మెంట్ కు నిరాకరిస్తుండటం, డాక్టర్లపై దాడులు చేస్తుండటం  ఆయా నివాసిత ప్రాంతాల్లో టెస్టులు చేసేందుకు వెళ్లిన వైద్య సిబ్బందిని తిట్టటం ఇబ్బందికర పరిణామంగా మారింది.

వివరాలలోకి వెళితే నిజామాబాద్ సిటీ నుంచి మాత్రమే ఢిల్లీ ప్రార్థనలకు 50 మంది వెళ్లొచ్చినట్లు గుర్తించిన అధికారులు. పోలీసుల సాయంతో వాళ్లందరినీ అదుపులోకి తీసుకుని క్వారంటైన్ కు తరలించారు. అందులో ఒకరికి పాజిటివ్ అని తేలగా, మరికొందరి టెస్టుల ఫలితాలు రావాల్సి ఉంది. వీరి ద్వార వాళ్ల కుటుంబీకులకు కూడా వైరస్ సోకి ఉంటుందేమోననే అనుమానంతో టెస్టులు చేసేందుకు వైద్య సిబ్బంది వెళ్లారు. కానీ జనం వాళ్లను అడ్డుకుని నానా మాటలు అనడంతో నర్సులు కన్నీరు పెట్టుకున్నారు. ఆరోగ్యం ఎలా ఉందని అడిగినందుకు మమ్మల్ని బండబూతులు తిట్టారు. వీధిలో నుంచి కుక్కల్ని తరిమినట్లు తరిమేశారు. మాకు కూడా కుటుంబాలున్నాయి. రిస్క్ అయిన తెలిసినా, డాక్టర్ గా ధర్మంతో ప్రభుత్వ ఆదేశాలమేరకు మేం పనిచేస్తున్నాం. వైరస్ టెస్టులు చేయించుకోక పోతే జరిగే ప్రమాదాన్ని వివరించినా జనం వినిపించుకోవడం లేదు. అని డాక్టర్లు విలపించారు. గాంధీ ఆస్పత్రిలో డాక్టర్లపై దాడి, నిజామాబాద్ లో వైద్య సిబ్బంది అడ్డగింత, వాళ్లపై దూషణలు భరించలేనివిగా ఉననాయి. ఈ ఘటనల్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తున్నది. నిజానికి కోరానా టెస్టులకు నిరాకరిస్తూ, డాక్టర్లకు సహకరించనివాళ్లంతా అజ్ఞానులే కాదు.. తోటివారికి, మొత్తం సమాజానికి ప్రమాదకారులు కూడా అని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు.

For All Tech Queries Please Click Here..!
Topics: