చంద్రబాబు వల్లే కోడెల ఆత్మహత్య, సాక్ష్యం దొరికింది.

Wednesday, September 18, 2019 01:33 PM Politics
చంద్రబాబు వల్లే కోడెల ఆత్మహత్య, సాక్ష్యం దొరికింది.

దివంగత నేత, మాజీ స్పీకర్ శ్రీ కోడెల శివ ప్రసాదరావును మానసిక క్షోభకు గురిచేసింది చంద్రబాబునాయుడే అని తేలిపోయింది. కోడెల మానసిక క్షోభకు మీరు అంటే కాదు మీరే కారణమంటు అధికార, ప్రతిపక్ష నేతల మధ్య ఆరోపణలు యుద్ధం నడుస్తున్న విషయం మనకి తెలిసిందే. ఈ నేపధ్యంలోనే బీజేపీ ఈ వివాదంలో ఎంటర్ అయ్యింది. బిజెపి అధికార ప్రతినిధి పురిపళ్ళ రఘురామ్ మాట్లాడుతూ చంద్రబాబు వల్ల తాను మానసిక క్షోభకు గురి అవుతున్నట్లు శివ ప్రసాదరావు వాపోయారని చెప్పటం సంచలనంగా మారింది. తెలుగుదేశంపార్టీలో తాను ఒంటరిని అయిపోయినట్లు రఘురామ్ తో చెప్పుకుని బాధపడిపోయారట. దాదాపు నెల రోజుల క్రితం కోడెలకు తనకు ఫోన్ చేసినట్లు కూడా రఘురామ్ చెప్పటం కలకలం రేపుతోంది.

తనతో కోడెల ఫోన్ లో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు తనను ఒంటరిని చేసినందుకు బాధపడ్డారని చెప్పారు. చంద్రబాబు తనను చాలా నిర్లక్ష్యం చేస్తున్నారని ఫీలైనట్లు బయటపెట్టారు. నిజాయితీతో పనిచేసే నాయకులకు టిడిపిలో విలువ లేకుండా పోతుందని కూడా వాపోయారట. పార్టీలో తనను ఒంటరిని చేసేయటంతో తాను మానసిక క్షోభకు గురవుతున్నట్లుగా కోడెల ఫీలైనట్లు రఘురామ్ చెప్పిన దాన్ని బట్టి తెలుస్తోంది. దీనివల్లనే తాను టిడిపిలో ఇమడలేకపోతున్నట్లు చెప్పుకుని ఫీలయ్యారట. అందుకనే తాను టిడిపికి రాజీనామా చేసేయాలని నిర్ణయించుకున్నట్లు కూడా చెప్పారట. తాను బిజెపిలో చేరాలని అనుకుంటున్నట్లు చెప్పిన కోడెల అమిత్ షా అపాయిట్మెంట్ కావాలని అడిగారని రఘురామ్ చెప్పటంతో వివాదం కీలక మలుపు తిరిగింది.

For All Tech Queries Please Click Here..!
Topics: