Kodali Nani: అదే జరిగితే ఈ సారి ఎన్నికల్లో పోటీ చేయను: కొడాలి నాని

Saturday, December 26, 2020 04:15 PM Politics
Kodali Nani: అదే జరిగితే ఈ సారి ఎన్నికల్లో పోటీ చేయను: కొడాలి నాని

Amaravati, Nov 15: చంద్రబాబుకు గుడివాడ ఎమ్మెల్యే, వైసీపీ మంత్రి కొడాలి నాని (Kodali Nani) సవాల్ విసిరారు. గుడివాడలో 17 వేల మంది పేదలకు ఇళ్ల స్థలాలు, ఇల్లు ఇస్తాం. మహిళలు పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి ఇస్తాం. అలా జరగని పక్షంలో వచ్చే ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేయనని తెలిపారు. మార్కెట్ యార్డులో టిడ్కో లబ్ధిదారులతో సోమవారం బహిరంగ సభ నిర్వహించారు. మార్కెట్ యార్డు నుంచి మల్లాయి పాలెం టిడ్కో ఇళ్ల సముదాయాల వరకు మంత్రి కొడాలి నాని ఈ సందర్భంగా పాదయాత్ర నిర్వహించారు.

గుడివాడ గడ్డపై నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాను. ఇక్కడ ఇళ్ళు లేని పేదలు ఎంతో మంది ఉన్నారు. చంద్రబాబు (Chandrababu Naidu) ఎన్నికల ముందు హడావుడిగా శంఖుస్థాపన చేశారు. అంతేతప్ప వీటి గురించి పెద్దగా పట్టించుకోలేదు. చిన్న వర్షం కురిస్తే చాలు.. ఇళ్ల సముదాయాల వరకు వెళ్ళలేని దుస్థితి. అందుకే అర్హులందరికీ లబ్ది చేకూర్చాలనే ఉద్దేశంతో ఇళ్ల స్థలాల కోసం 94 కోట్ల తో 181 ఎకరాలు తీసుకున్నాం. 8 వేల మందికి సెంటు స్టలం ఇస్తాము. టిడ్కో లబ్ధిదారుల దగ్గర డబ్బులు బాబు కట్టించుకున్నారు. వాటిని వేరే అవసరాల కోసం వాడుకున్నారు. ఇప్పుడు ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా కోర్టులకు వెళ్లి అడ్డుకుంటున్నారు.
 
చంద్రబాబు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఇళ్ళు ఇవ్వకపోగా శకునిలా అన్నింటికీ అడ్డుపడుతున్నారు. తమ కులస్తుడు చంద్రబాబే ముఖ్యమంత్రి ఉండాలని కొందరు కోరుకుంటున్నారు. ఇతర కులస్తులు ముఖ్యమంత్రిగా  ఉంటే ఓర్వలేక పోతున్నారు. ప్రభుత్వాన్ని అస్థిర పరచాలని కుట్రలు చేస్తున్నారు. నాకు వ్యాపారాలు లేవు. నేను బతికున్నంత వరకు ప్రజల అభివృద్ధి కోసం పని చేస్తాను. 2024 ఎన్నికల నాటికి ఇళ్ళు ఇవ్వకపోతే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటాను’’ అని కొడాలి నాని ఎల్లో మీడియా తీరును ఎండగట్టారు.
 
చంద్రబాబూ.. ఎన్ని ఇళ్ళు కట్టించావో చెప్పు. కొడాలి నాని అవినీతి కి పాల్పడ్డాడని నిరూపిస్తే ఉరివేసుకోవడానికి సిద్ధం. చంద్రబాబుకు సవాల్‌ విసురుతున్నా. టిడ్కో ఇళ్ల వద్ద వైఎస్సార్‌ విగ్రహం ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో ప్రారంభోత్సవం చేయిస్తా. రాష్ట్రానికి శనిలా పట్టిన చంద్రబాబు కాకిలా కలకాలం ఉంటారు. సిగ్గు శరం లేకుండా మాట్లాడుతారు. వెన్నుపోటు సంస్కృతి ఆయనకే సొంతం. ఇప్పుడేమో ఇతర పార్టీల్లో చీలికలు అంటూ అసత్య ప్రచారాలు చేస్తున్నారు’’ అంటూ చంద్రబాబు తీరుపై ధ్వజమెత్తారు.

For All Tech Queries Please Click Here..!