కేసీఆర్‌కు భారీ షాక్‌, అనుకున్నది ఒకటి, అయింది మరోకటి

Tuesday, May 14, 2019 08:41 AM Politics
కేసీఆర్‌కు భారీ షాక్‌, అనుకున్నది ఒకటి, అయింది మరోకటి

టీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అనుకున్నది ఒక్కటి అయినది మరొకటి అన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎన్నికల అనంతరం కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో ఫెడరల్ ఫ్రంట్ కీలక భూమిక పోషించేలా చూసేందుకు ఆయన అడుగులు వేస్తున్న విషయం మనకి విదితమే, అయితే వాస్తవంగా పరిస్థితులు మాత్రం అందుకు విరుద్దంగా సాగుతున్నాయి అని సమాచారం. సోమవారం డీఎంకే అధినేత స్టాలిన్‌తో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. చెన్నై అళ్వార్‌పేటలోని స్టాలిన్ నివాసంలో దాదాపు గంటపాటు ఇరువురి భేటీ కొనసాగింది. ఈ సందర్భంగా స్టాలిన్ కేసీఆర్‌కు షాకిచ్చినట్లు సమాచారం.

ఈ భేటీలో ప్రధానంగా ఈనెల 23న లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించినట్లుగా సమాచారం. కేంద్రంలో ఏ జాతీయపార్టీకి ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన సీట్లు రావని, ప్రాంతీయ పార్టీల ఎంపీల సంఖ్య అత్యంత కీలకంగా మారుతుందని, ఈ నేపథ్యంలో రాష్ట్రాల ప్రజాప్రయోజనాలు సాధించుకోవడానికి ప్రాంతీయ నేతలంతా ఐక్యంగా ఉందామని స్టాలిన్‌కు సీఎం కేసీఆర్ వివరించినట్లుగా సమాచారం. దేశంలోని పలు ప్రాంతీయపార్టీల నేతలతో చర్చిస్తున్నానని, వారంతా తనకు సానుకూలంగా స్పందిస్తున్నారని కెసిఆర్ చెప్పినట్లు తెలిసింది. అయితే, ఫెడరల్‌ ఫ్రంట్‌లో చేరాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రతిపాదనను స్టాలిన్‌ తిరస్కరించారు. తాము కాంగ్రెస్‌ వైపే ఉంటామని ఆయన స్పష్టం చేశారు.

For All Tech Queries Please Click Here..!