సీఏం గుడ్ న్యూస్, అమ్మ ఒడి కండీషన్స్ తొలగింపు డబ్బులు అర్హులందరికీ వచ్చేస్తాయి

Thursday, January 16, 2020 02:00 PM Politics
సీఏం గుడ్ న్యూస్, అమ్మ ఒడి కండీషన్స్ తొలగింపు  డబ్బులు అర్హులందరికీ వచ్చేస్తాయి

పరిపాలనలో దూసుకుపోతున్న ఏపీ సీఎం వైయస్ జగన్ అమ్మఒడి పథకం లబ్ధిదారులకు గుడ్ న్యూస్ వినిపించారు. ఈ పథకానికి 75శాతం హాజరు ఉండాలనే నిబంధనను మినహాయింపు ఇస్తున్నట్లు ప్రకటించారు. తొలి ఏడాది మాత్రమే మినహాయింపు ఇచ్చారు. రెండో ఏడాది నుంచి 75శాతం హాజరు నిబంధన కచ్చితంగా అమలు చేయాలని విద్యాశాఖ అధికారులను సీఎం ఆదేశించారు.

అర్హులందరికీ సంతృప్తికర స్థాయిలో అమ్మ ఒడి పథకం  అందాల్సిందేనని, నిబంధనలంటూ ఇబ్బంది పెట్టకుండా వాస్తవాలను పరిశీలించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.

జనవరి 9న చిత్తూరులో అమ్మఒడి పథకాన్ని సీఎం జగన్ ప్రారంభించనున్నారు. ఈ పథకానికి ప్రభుత్వం రూ.6వేల 400 కోట్లు కేటాయించింది. 10వ తరగతి నుంచి ఇంటర్ వరకు పిల్లలను బడికి పంపే ప్రతీ తల్లికి/సంరక్షకులకు ఏడాదికి రూ.15వేలు ఆర్థిక సాయంగా ఇస్తారు. ముందుగా అకౌంట్ లో రూ.1 వేసి లబ్దిదారుల ఖాతాలను తనిఖీ చేస్తారు. ఆ తర్వాత రూ.15వేల చొప్పున జమ చేస్తారు.

కొన్ని కుటుంబాల్లో విద్యుత్‌ వినియోగం నెలకు 300 యూనిట్లు ఉందని, ఇందులో ఉమ్మడి కుటుంబాలకు చెందిన పిల్లలు ఉన్నందున మినహాయింపు ఇవ్వాలని క్షేత్ర స్థాయి నుంచి వినతులు వస్తున్నాయని అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. మరోసారి రీ వెరిఫికేషన్‌ చేయించి, అర్హులైన వారికి తప్పనిసరిగా ఈ పథకం వర్తింప చేయాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

మధ్యాహ్న భోజనం మెనూ ఇలా..

సోమవారం : అన్నం, పప్పుచారు, ఎగ్‌ కర్రీ, చిక్కి

మంగళవారం : పులిహోర, టమాటా పప్పు, ఉడికించిన గుడ్డు

బుధవారం : కూరగాయలతో అన్నం, ఆలూ కుర్మా, ఉడికించిన గుడ్డు, చిక్కి

గురువారం : కిచిడి (పెసరపప్పు అన్నం), టమాటా చట్నీ, ఉడికించిన గుడ్డు

శుక్రవారం: అన్నం, అకుకూర పప్పు, ఉడికించిన గుడ్డు, చిక్కి

శనివారం : అన్నం, సాంబారు, స్వీట్‌ పొంగలి

For All Tech Queries Please Click Here..!