జగన్ ఫైర్ మన కళ్ల ముందే ఇన్ని మోసాలా..?

Saturday, May 2, 2020 08:45 AM Politics
జగన్ ఫైర్ మన కళ్ల ముందే ఇన్ని మోసాలా..?

సీఎం జగన్ వ్యవసాయ శాఖ అధికారులపై మండిపడ్డారు . కృష్ణా జిల్లాలో ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలు జరుగుతున్నాయంటూ ఫిర్యాదులు వచ్చాయి .వ్యవసాయంపై నిర్వహించిన సమీక్షలో ఈ ఫిర్యాదులపై జగన్ అధికారులతో చర్చించారు. ధాన్యం సేకరణ సమయంలో బస్తాకు కొంత ధాన్యాన్ని మినహాయిస్తున్నారన్నది ఫిర్యాదుల్లో ఉందని దీనిపై సీఎం జగన్ బాగా సీరియస్ అయ్యారట. ముఖ్యమంత్రి , చీఫ్‌ సెక్రటరీ , సెక్రటరీ , డీజీపీ లాంటి వ్యక్తులంతా కృష్ణా జిల్లాలో ఉన్నా ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం ఏంటని అధికారులను నిలదీశారట. ఇలాంటి మోసాలపై వెంటనే సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు .

రైతులకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోవద్దని స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో ధాన్యం సేకరణ పెంచాలని, రైతులు ధాన్యం కొనుగోలు లో మోసాలు జరగ కుండా ఉండేందుకు పటిష్ట చర్యలు తీసుకోవాలని రైతులను మోసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. చీనీ , అరటి , టమోటో , మామిడి తదితర ప్రాసెసింగ్ ప్లాంట్లపై దృష్టి పెట్టాలని కూడా సీఎం ఆదేశించారు . ఇకపై రాష్ట్రంలో పంటలను రోడ్డపై పారబోసే ఘటనలు కనిపించడానికి వీల్లేదని అధికారులకు స్పష్టం చేశారు సీఎం .

For All Tech Queries Please Click Here..!
Topics: