టీడీపీ ప్రభుత్వంపై కడుపు మండిన ఓ రాయలసీయ రైతన్న వ్యధ!

Friday, January 4, 2019 12:37 PM Politics
టీడీపీ ప్రభుత్వంపై కడుపు మండిన ఓ రాయలసీయ రైతన్న వ్యధ!

చంద్రబాబు ఏది చెబితే దానికి తల ఊపితే, గొప్ప నాయకుడు లేకపోతే ప్రజావ్యతిరేక  ప్రజాస్వామ్యం. రాజధాని అమరావతిలో ఏర్పాటు చేస్తున్నామని అసెంబ్లీలో ప్రకటించిన సమయంలో జగన్ వ్యతిరేకించాడు. కేవలం రాజధాని కోసం భూములు సేకరించే విధానాన్ని ప్రభుత్వం ఎంచుకున్న మార్గాన్ని చేస్తున్న తప్పులను మాత్రమే చేసి చూపించాడు తప్ప రాజధాని అమరావతి వద్దని ప్రకటించలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి అనేది ఒకే ప్రాంతంలో కేంద్రీకృతమై ఉండడం వలన విభజన తర్వాత ఏపీకి అన్యాయం జరిగిందని తెలుసుకుంటే బాగుంటుంది. భవిష్యత్తులో ఇలా జరక్కుండా అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి అనేది సమానంగా తెలుగుదేశం ప్రభుత్వం చేస్తుందా... ప్రతిరోజు ఉదయం నుంచి రాత్రి వరకు పోలవరం అమరావతి ఈ రెండే నా రాష్ట్రానికి ప్రధానం ఇంకేం లేవా...? ఒక్కసారి రాయలసీమ ప్రాంతానికి వచ్చి చూడండి తెలుస్తుంది. ఈ ప్రాంత రైతులు రైతు కూలీలు నిరుద్యోగులు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో తెలుస్తుంది.

పట్టిసీమ నిర్మించి కృష్ణాడెల్టాకు సాగునీరు ఇచ్చామని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం డెల్టాకు ఇచ్చే కృష్ణా జలాలను రాయలసీమ జిల్లాలకు తరలిస్తామన్నారు ఎందుకు పట్టించుకోలేదు చంద్రబాబు. ప్రభుత్వం పట్టిసీమ నిర్మించకముందు కంటే రాయలసీమకు అదనపు జలాలు ఎక్కడ వచ్చాయో చెప్పగలరా ఆ రోజుల్లోనే పోతిరెడ్డిపాడు ద్వారా 90 టీఎంసీలకు పైగా నీరు వచ్చిన రోజులు ఉన్నాయని జలవనరుల శాఖ ఇంజనీర్ల గణంకాలు చెబుతున్నాయి. కానీ చంద్రబాబు చాణిక్య తనంతో రాయలసీమ ప్రాంత నాయకుల అవసరాలను ఆసరాగా చేసుకొని తాను కూడా ఈ ప్రాంతానికి చెందిన వ్యక్తి అయినా చంద్రబాబు నాయుడు రాయలసీమను ఎందుకు విస్మరిస్తున్నారు...? అనంతపురం జిల్లాలో నిర్మించిన కియా మోటార్స్ తన వల్లే వచ్చిందని గొప్పలు చెప్పుకుంటున్నారు మరి కర్నూలు జిల్లాలో ఇండస్ట్రీల కోసం 2015 ఆగస్టు 17వ తేదీన శంకుస్థాపన చేసి ఏడాది ఏడాదిన్నరలో పరిశ్రమలు పూర్తి చేస్తామన్న హామీ ఎందుకు విస్మరించారు...? కియా మోటర్స్ కంపెనీకి నీటి అవసరాలను తీర్చిన తెలుగుదేశం ప్రభుత్వం ఓర్వకల్లు ఇండస్ట్రియల్ హబ్‌కు ఎందుకు నీటి సదుపాయాలు కల్పించలేదు...? చంద్రబాబు తాను పొగిడితే ఇతరులు పొగడాలి అంటాడు, తాను తిడితే ఇతరుల కూడా తిట్టాలి అంటాడు ఇదేనా ఆయన 40 ఏళ్ల రాజకీయ అనుభవంలో నేర్చుకుంది...?