ఏపీ ప్రభుత్వంపై విమర్శల ఫలితం, నర్సీపట్నం డాక్టర్ సస్పెన్షన్..

Wednesday, April 8, 2020 02:24 PM Politics
ఏపీ ప్రభుత్వంపై విమర్శల ఫలితం,  నర్సీపట్నం డాక్టర్ సస్పెన్షన్..

ఏపీ ప్రభుత్వం కరోనా రోగులకు వైద్యం అందిస్తున్న వారికి సరైన వ్యక్తిగత రక్షణ పరికరాలు అందించడం లేదంటూ సుధాకర్ అనే డాక్టర్ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే , అయితే ఇప్పుడు ఆరోపణలు చేసిన నర్సీపట్నం డాక్టర్ సుధాకర్ పై వేటు పడింది. డాక్టర్ విమర్శలను సీరియస్ గా పరిగణించిన ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేయడంతో పాటు పలు సెక్షన్ల కింద కేసులు కూడా నమోదు చేయడం కలకలం రేపుతోంది.  లేవనెత్తిన విషయం సరైనదే అయినా ఎంచుకున్న మార్గంపై విమర్శలు రావడంతో ఏపీ వైద్య విధాన పరిషత్ ఇవాళ దీనిపై స్పందించింది. ప్రభుత్వంపై బహిరంగంగా విమర్శలకు దిగిన డాక్టర్ సుధాకర్ పై సస్పెన్షన్ వేటు విధించింది.

డాక్టర్ సుధాకర్ కరోనా వైద్యం విషయంలో ప్రభుత్వ వైఖరిని నేరుగా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసి ఉంటే సరిపోయేది. అలా కాకుండా ప్రభుత్వంపై బహిరంగంగా విమర్శలకు దిగడంతో ఈ ఘటన రాజకీయ రంగు పులుముకుంది. స్ధానిక నర్సీపట్నం ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేశ్, డాక్టర్ సుధాకర్ గతంలో మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఇంటికి వెళ్లిన సీసీటీవీ ఫుటేజ్ విడుదల చేయడం, టీడీపీ నేతలు దానికి కౌంటర్ ఇవ్వడం చకచకా జరిగిపోయాయి. దీంతో ప్రభుత్వం ఈ వ్యవహారం మరింత ముదరకముందే డాక్టర్ ను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు ఇప్పించింది.

For All Tech Queries Please Click Here..!
Topics: