ఒకపక్క కరోనా, మరోపక్క రాష్టం పైన మరో పిడుగు.

Saturday, May 2, 2020 08:32 AM Politics
ఒకపక్క కరోనా, మరోపక్క రాష్టం పైన మరో పిడుగు.

 బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా మూడు రోజులపాటు వర్షాలు పడనున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ అండమాన్ సముద్రం, పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంవల్ల దక్షిణ అండమాన్ సముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతం ప్రాంతాల్లో శుక్రవారం అల్పపీడనం ఏర్పడింది.

దీనికి అనుబంధంగా 4.5 కిలోమీటర్ల ఎత్తువరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. అల్పపీడనం రాగల 48 గంటల్లో మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఫలితంగా గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

For All Tech Queries Please Click Here..!
Topics: