సీఎం వర్సెస్ ఎన్నికల సంఘం: మధ్యలో సీఎస్ సతమతం: ఆదేశాలు అమలవుతాయా!

Monday, March 16, 2020 09:36 AM Politics
సీఎం వర్సెస్ ఎన్నికల సంఘం: మధ్యలో సీఎస్ సతమతం: ఆదేశాలు అమలవుతాయా!

అమరావతి: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు కొత్త వివాదానికి కారణమైంది. ఎన్నికల సంఘం నిర్ణయంతో ఇప్పుడు ఏపీ ప్రభుత్వ విభేదిస్తోంది. ఏకంగా ముఖ్యమంత్రి జగన్ నేరుగా ఎన్నికల కమిషనర్ పైన విరుచుకుపడ్డారు. ఆయన పైన చర్యలు తీసుకోవలని కోరుతూ గవర్నర్ వద్దకు వెళ్లి ఫిర్యాదు చేసారు. దీని పైన అవసరమైతే ముందుకు వెళ్తామని స్పష్టంగా చెప్పారు. ఎన్నికలు వాయిదా వేసిన కమిషనర్,అధికారుల పైన చర్యలు ఎలా తీసుకుంటారని ముఖ్యమంత్రి ప్రశ్నిస్తున్నారు.రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఆ అధికారాలే లేవని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించటంతో ఇప్పుడు ఈ వ్యవహారం సున్నితంగా మారింది. అయితే, తమకు ఉన్న విచక్షణాధికారం మేరకు నిర్ణయం తీసుకుంటున్నామని ఎన్నికల సంఘం స్పష్టం చేస్తోంది.

For All Tech Queries Please Click Here..!