టీడీపీలో మరో కేసీఆర్...లోకేష్ బాబే టార్గెట్...గుంటూరు కేంద్రంగా సంచలన తిరుగుబాటు

Saturday, January 2, 2021 02:15 PM Politics
టీడీపీలో మరో కేసీఆర్...లోకేష్ బాబే టార్గెట్...గుంటూరు కేంద్రంగా సంచలన తిరుగుబాటు

తెలుగు దేశం పార్టీ గతమెంతో వైభవం..వర్తమానం అగమ్యం...భవిష్యత్తు శూన్యంలా మారిపోయింది. 2019 ఎన్నికల్లో చావు దెబ్బ తిన్న టీడీపీ పార్టీ స్థాపించినప్పటి నుంచి ఈ స్థాయిలో దారుణంగా ఎప్పుడూ పతనం కాలేదు. ఎన్నికల్లో గెలుపు ఓటమి సహజం, అయితే టీడీపీకి ఈ సారి ఎదురైన ఓటమి మాత్రం చావుదెబ్బే అని చెప్పాలి. నిజానికి తెలంగాణ ఏర్పాటు తర్వాత ఆ ప్రాంతంలో టీడీపీ పూర్తిగా పునాదులు లేకుండా నాశనం అయిపోయింది. ఇక చంద్రబాబు నాయుడు అయితే ఏకంగా ఓటుకు నోటు కేసులో ఇరుక్కొని పార్టీని ఆత్మహత్య దిశగా నడిపించాడు. ఇక 2019 ఎన్నికలకు ముందు లోకేష్ కు నాయకత్వం అందించిన చంద్రబాబుకు, ఎన్నడూ లేనంత అవమానం జరిగింది. ఓటమిని జీర్ణించుకోలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో అటు కేడర్ తో పాటు లీడర్లలో కూడా చంద్రబాబు తప్పిదాలను నేరుగా బయటకే చెబుతున్నప్పటికీ, మరో ప్రత్యామ్నాయం లేక నారా కుటుంబం నాయకత్వంలోనే పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక చంద్రబాబు తర్వాత లోకేష్ నాయకత్వం అయితే మరింత పతనానికి దారి తీస్తుందని ఆ పార్టీలోని పెద్దలు ఆలోచిస్తున్నారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు కుమారుడిగా మినహా లోకేష్ తనను తాను ఇప్పటి వరకూ నిరూపించుకున్న సందర్భాలు శూన్యం అనే చెప్పాలి.

మంగళగిరిలో తేలిపోయిన చినబాబు సత్తా...

మంగళగిరిలో స్వయంగా ఓడిపోవడంతో అతడి సత్తా ఏంటి అనేది...బయట పడింది. పార్టీకి రాబోయే రోజుల్లో అధినేతగా ఎదగాల్సిన వ్యక్తి, స్వయంగా తానే ఓడిపోతే, ఇక ఇతరులను ఏమి గెలిపిస్తారన్న నిరాశ కార్యకర్తల్లో వ్యక్తం అవుతోంది. మరీ ముఖ్యంగా ఎఫ్పుడూ టెక్నాలజీ, రిపోర్టులు, సర్వేలు అంటూ హడావిడి చేసే చినబాబు, అధికారంలో ఉన్నసమయంలో ఎమ్మెల్యేలను సర్వేల పేరిట, ర్యాంకులు, రిపోర్టులు అంటూ హడలెత్తించారట. మరి శకునం చెప్పే బల్లి కుడితిలో పడి చచ్చింది అన్న చందంగా అందరి సర్వేలను చేసే చినబాబు తన సర్వే చూసుకోలేకపోయారు.

పనిచేసే కార్యకర్తలపై లోకేష్ బాబు మోకాలడ్డు..

పార్టీ కార్యకర్తలు ఓ వైపు బూతు స్థాయి నుంచి కష్టపడుతూ మరో సారి అధికారంలోకి ఎలా రావాలా అని ఆలోచిస్తుంటే, చినబాబు మాత్రం దిశానిర్దేశనం బదులు, పని చేస్తున్న వారిపై బండలు వేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇక నారా కుటుంబంలో మరో ఆల్టర్నేటివ్ నాయకత్వం లేదని కార్యకర్తలు భావిస్తున్నారు. ఇక నందమూరి కుటుంబం వైపు చూస్తే ఎన్టీఆర్ తనయుడు నందమూరి బాలకృష్ణకు ప్రస్తుతం అంతటి చాకచక్యం లేదనే చెప్పాలి. ఆయన వివాదాస్పద వ్యవహారశైలితో పాటు రాజకీయాలను అంత సీరియస్ గా తీసుకోకపోవడం, అలాగే కేవలం హిందూపురం రాజకీయలకు మాత్రమే పరిమితం కావడంతో నందమూరి కుటుంబంపై కార్యకర్తలు ఆశలు వదులుకున్నారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తారో రారో తెలియని పరిస్థితి నెలకొని ఉంది.

గుంటూరు కేంద్రంగా టీడీపీలో భూకంపం వచ్చే చాన్స్...

గుంటూరు జిల్లా అంటేనే రాజకీయాలకు పెట్టింది పేరు. ఈ జిల్లా రాజకీయాలు రాష్ట్ర రాజకీయాలను శాసిస్తాయనేది అందరికీ తెలిసిన సత్యం. ముఖ్యంగా వ్యాపార వాణిజ్యాలకు కేంద్రంగా నిలిచిన గుంటూరు జిల్లా. ఆంద్ర ప్రదేశ్ కు నలుగురు ముఖ్యమంత్రులను అందించింది. కాసు బ్రహ్మానందరెడ్డి మొదలు. భవనం వెంకట్రామిరెడ్డి, నాదెండ్ల భాస్కరరావు, కొణిజేటి రోశయ్య వరకూ సీఎం పదవిని అలంకరించారు. అయితే వీరిలో కాసు బ్రహ్మానందరెడ్డి ఒక్కరే పూర్తి కాలం ముఖ్యమంత్రిగా ఉన్నారు. కానీ ప్రతీ కేబినేట్ లోనూ గుంటూరు జిల్లాకు చెందిన మంత్రులకు ప్రత్యేక స్థానం ఉంది. కారణం వాణిజ్య వర్గాలకు గుంటూరు పెట్టింది పేరు. అందుకే వీరి మద్దతు ఉంటేనే రాష్ట్రంలో రాజకీయం నడుస్తుంది. ఇక టీడీపీలో అయితే గుంటూరు మరీ ప్రత్యేకం అనే చెప్పాలి. సామాజిక వర్గ పరంగానూ, అటు ఆర్థిక అండదండలు అందించే నేతల పరంగానూ గుంటూరు ముందు వరుసలో ఉంటుంది.

టీడీపీలో నారా కుటుంబానికి చెక్ పెట్టనున్న గుంటూరు దిగ్గజ నేత...

గుంటూరు జిల్లాలో టీడీపీ కచ్చితంగా గెలుస్తుంది అని గ్యారంటీగా చెప్పే సీటు ఏదైనా ఉందంటే అది పొన్నూరే అని చెప్పాలి. ఇక్కడ టాడీపీ వ్యవస్థాపన జరిగినప్పటి నుంచి వరుసగా గెలుస్తూనే ఉంది. పార్టీ చిత్తు చిత్తుగా ఓడిపోయిన సందర్భాల్లో కూడా ఈ నిజయోకవర్గంలో మాత్రం టీడీపీ గెలుస్తూనే ఉంది. అయితే ఈ విజయం వెనుకు ధూళిపాళ్ల కుటుంబమే కారణం అని చెప్పాలి. ధూళిపాళ్ల నరేంద్ర ఈ నియోజక వర్గం నుంచి 1994 నుంచి 2019 వరకూ అప్రతిహతంగా ధూళిపాళ్ల నరేంద్ర గెలుస్తూ వస్తున్నారు. రాష్ట్ర స్థాయి నేతగానూ ధూళి పాళ్లకు మంచి పేరుంది. అయితే టీడీపీ పార్టీకి పూర్వ వైభవం తేవాలంటే ధూళిపాళ్ల లాంటి లీడర్లకు పగ్గాలు ఇస్తేనే పనవుతుందని చాలా మంది భావిస్తున్నారు. ఇంతకాలం చంద్రబాబును నమ్ముకున్న టీడీపీ నేతలు, ఇకపై బాబు రాజకీయ చరమాంకానికి చేరుకోవడంతో కొత్త నాయకత్వం వైపు చూస్తున్నారు.ఇక లోకేష్ బాబు నాయకత్వంపై అయితే ఏ మాత్రం లేకుండా పోయింది. దీంతో ధూళిపాళ్ల నాయకత్వంలో తెలుగు దేశంలో అతి త్వరలోనే తిరుగుబాటు ఖాయంగా కనిపిస్తోంది.  

కేసీఆర్ బాటలోనే గుంటూరు టీడీపీ నేత...

సరిగ్గా 20 ఏళ్ల  క్రితం కేసీఆర్ సైతం టీడీపీలో ఉంటూనే బయటకు వచ్చి తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు చేసి సరిగ్గా 15  తిరిగే సరికి రాష్ట్ర విభజనతో పాటు అధికారం సైతం చేపట్టారు. సరిగ్గా ఇఫ్పుడు అదే తరహాలో ధూళిపాళ్ల సైతం తిరుగుబాటు చేసి కనీసం నమ్ముకున్న కార్యకర్తలనైనా కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారని  ఆయన సన్నిహితులు అంటున్నారు.  

For All Tech Queries Please Click Here..!