బ్రేకింగ్: అసెంబ్లీ‌లో వైసీపీ‌కి దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చిన చంద్రబాబు...!

Tuesday, July 16, 2019 02:29 PM Politics
బ్రేకింగ్: అసెంబ్లీ‌లో వైసీపీ‌కి దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చిన చంద్రబాబు...!

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ 2019 సమావేశాలు చాలా హాట్ హాట్ గా జరుగుతున్నాయి. ఒకరికపై ఒకరు కత్తులు నూరుకుంటున్నారు. ప్రధానంగా ప్రతిపక్ష నేత చంద్రబాబు టీడీపీ ఎమ్మెల్యేలపై అధికార పార్టీ ఎమ్మెల్యేలు విరుచుకుపడుతున్నారు. ముఖ్యంగా ప్రతిపక్ష నేత చంద్రబాబు అయిదేళ్ల పాలన మీద అవకాశం చిక్కినప్పుడల్లా మంత్రులు కౌంటర్ల మీద కౌంటర్లు వేస్తున్నారు. నీటి పారుదల శాఖా మంత్రి అనిల్ కుమార్ యాదవ్, విద్యాశాఖా మంత్రి ఆదిమూలపు సురేష్ , ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి ప్రతిపక్ష ఎమ్మెల్యేలపై సెటైర్ల మీద సెటైర్లు వేస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే చంద్రబాబుపై కూడా అవకాశం చిక్కినప్పుడల్లా మాటల దాడిని చేస్తున్నారు. అయితే చంద్రబాబు వీటన్నింటినీ తిప్పికొడుతూ ముందుకు దూసుకెళుతున్నారు. ఈ సంధర్భంగా మంత్రి ఆదిమూలపు సురేష్ అడిగిన ప్రశ్నకు చంద్రబాబు " నేను నీతి నిజాయితీలతో పనిచేశాను. దమ్ముంటే నా మీద ఎంక్వయిరీ వేయించండి " అంటూ కౌంటర్ వేశారు. ఇంకా ఏం అన్నారో వీడియోలో చూడవచ్చు.

For All Tech Queries Please Click Here..!
Topics: