ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు 10 వేల సాయం, నేటి నుంచి దరఖాస్తులకు ఆహ్వానం..

Tuesday, September 10, 2019 12:05 PM Politics
 ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు 10 వేల సాయం, నేటి నుంచి దరఖాస్తులకు ఆహ్వానం..

జగన్ తన మరో హామీని నెరవేర్చనున్నారు. ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్‌ డ్రైవర్లకు ఏడాదికి రూ. 10 వేల ఆర్థిక సాయంపై విధి విధానాలను రాష్ట్ర ప్రభుత్వం సోమవారం జారీ చేసింది. మంగళవారం (సెప్టెంబర్ 10, 2019) నుంచి అన్ని రవాణా శాఖ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకునేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. అన్ని జిల్లాల్లో రవాణా శాఖకు హెల్ప్‌ డెస్క్‌లు ఏర్పాటు చేయాలని సూచించారు. అర్హులైన డ్రైవర్లు తమ వాహనం, లైసెన్సుతో ఆధార్‌ను లింక్‌ చేసుకోవాలి. రవాణా శాఖ వెబ్‌సైట్‌ డేటాబేస్‌లో ఈ ప్రక్రియ పూర్తి చేసుకోవాలి. 15 రోజుల్లోగా అన్‌ ఎన్‌కంబర్డ్‌ ఖాతాను తెరవాలి.

ఈ ఖాతాను తెరిచేందుకు లబ్ధిదారుడికి గ్రామ/వార్డు వలంటీర్‌ సాయపడతాడు. ఒక ఇంట్లో ఒక వ్యక్తికి, ఒక వాహనానికి మాత్రమే ఈ సాయం వర్తిస్తుంది. దరఖాస్తులు ఆయా జిల్లాల కలెక్టర్ల నుంచి గ్రామ సచివాలయం/మున్సిపాలిటీలు/నగర కార్పొరేషన్లకు వెళతాయి. అర్బన్‌ ప్రాంతాల్లో మున్సిపల్‌ కమిషనర్, గ్రామీణ ప్రాంతాల్లో ఎంపీడీవో పర్యవేక్షణలో దరఖాస్తుల పరిశీలన జరుగుతుంది. అనంతరం కలెక్టరు అనుమతి తీసుకుని సీఎఫ్‌ఎంఎస్‌ డేటాబేస్‌ పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేస్తారు.  గ్రామ/వార్డు వలంటీర్ల ద్వారా లబ్ధిదారులకు ఇంటింటికీ రూ. పది వేల చెల్లింపు రశీదులు, సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సందేశంతో కూడిన పత్రాన్ని అందిస్తారు.

ఈ రూ. పది వేల సాయం పొందడానికి అర్హతలు ఇలా వున్నాయి.
-> ఆటో రిక్షా/ట్యాక్సీ/మ్యాక్సీ క్యాబ్‌ సొంతదైఉండాలి, సొంతగా నడుపుకోవాలి.
-> డ్రైవరుకి ఆటో రిక్షా/లైట్‌ మోటారు వెహికల్‌ డ్రైవింగ్‌ లైసెన్సు ఉండాలి.
-> సంబంధిత వాహనానికి రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్, పన్నుల రశీదులు సరిగా ఉండాలి.
-> అర్హుడు తెల్లరేషన్‌ కార్డుతో పాటు ఆధార్‌ కార్డు కలిగి ఉండాలి.
-> దరఖాస్తు చేసుకునే సమయానికి వాహనం లబ్ధిదారుడి పేరిట ఉండాలి. 

For All Tech Queries Please Click Here..!
Topics: