ఏపీ-తెలంగాణ మధ్య నీటి యుద్ధం.

Tuesday, May 12, 2020 12:17 PM Politics
ఏపీ-తెలంగాణ మధ్య నీటి యుద్ధం.

తెలుగు రాష్ట్రాల మధ్య స్నేహ పూర్వక సంబంధాలు ఉండాలని నది జలాలను పంచుకోవడంపై తెలంగాణ , మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ లతో స్నేహపూర్వక సంబంధాలు కొనసాగించాలని , గతంలో జల వివాదాలు పరిష్కరించాలని పలు మార్లు భేటీ అయిన తెలుగు రాష్ట్రాల సీఎంలు జలవివాదాల పరిష్కారంలో సక్సెస్ కాలేకపోయారు. ఇక తాజాగా శ్రీశైలం ప్రాజెక్ట్‌ నుంచి ఏపీ లిఫ్ట్‌ ఎత్తిపోతల పథకం ద్వారా నీటిని ఎత్తిపోయాలని ఏపీ సర్కార్ తీసుకున్న నిర్ణయంతో తెలుగు రాష్ట్రాల మధ్య మరోమారు జల జగడం మొదలయింది

ఈ ఏడాది 800 టీఎంసీల నీరు సముద్రం పాలైన నేపధ్యంలో అలా వరదనీరు దుర్వినియోగం కాకుండా ఉండేలా సీఎం జగన్ శ్రీశైలం ప్రాజెక్ట్ నుండి ఎత్తిపోతల పథకం ద్వారా వరద నీటిని సద్వినియోగం చేసుకునేందుకే ఆలోచన చేశారు . పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 80 వేల క్యూసెక్కులకు పెంచాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయించారు. ఇందుకోసం రూ.7 వేల కోట్లతో పాలనాపరమైన అనుమతులను ఇచ్చారు.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇరు రాష్ట్రాల చర్చల తర్వాతే ఇరు రాష్ట్రాలకు నష్టం జరగకుండా చర్యలు తీసుకుంటామని చెప్తుంది ఏపీ ప్రభుత్వం .తెలంగాణలో కానీ, ఆంధ్రప్రదేశ్ లో కానీ కొత్త నీటి పారుదల ప్రాజెక్టు నిర్మాణం చేపడితే అపెక్స్ కమిటీ అనుమతి తీసుకోవాలని ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం స్పష్టంగా పేర్కొంది. కానీ అపెక్స్ కమిటీ అనుమతులు తీసుకోలేదు . ఇక ఇది తెలంగాణా రాష్ట్రానికి ఆయుధంగా మారింది. సీఎం కేసీఆర్ ఏపీ తీసుకున్న ఈ నిర్ణయంపై గుర్రుగా ఉన్నారు.

For All Tech Queries Please Click Here..!
Topics: