సరిహద్దులో నిలిచిపోయిన వాహనాలు, సరిహద్దుల వివరాలు మీకోసం.

Tuesday, March 24, 2020 07:48 PM Politics
సరిహద్దులో నిలిచిపోయిన వాహనాలు, సరిహద్దుల వివరాలు మీకోసం.

ప్రాణాంతక కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో ఉభయ తెలుగు రాష్ట్రాలు లాక్‌డౌన్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జనజీవనం ఎక్కడిక్కడ స్తంభించిపోయింది. ఇక తెలంగాణ రాష్ట్ర సరిహద్దైన సూర్యాపేట జిల్లా కోదాడ మండలం రామాపురం క్రాస్‌రోడ్డులో చెక్‌పోస్టు వద్ద పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు. సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేసి వాహనాలను రాష్ట్రంలోకి ప్రవేశించకుండా అడ్డుకున్నారు. సరిహద్దులోకి వచ్చిన లారీలు, డీసీఎం వంటి వాహనాలను పక్కనే ఉన్న వెంచర్‌లో పార్కింగ్‌ ఏర్పాటు చేసి నిలిపారు. కార్లను సైతం నిలిపివేశారు. ఈనెల 31 వరకు లాకౌడౌన్‌ కొనసాగుతుండటంతో రాష్ట్రంలోకి వాహనాలను అనుమతించబోమని స్పష్టం చేశారు. ఎవరికీ ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో డ్రైవర్లకు, క్లీనర్లకు రవాణా శాఖ అధికారులు భోజన సదుపాయం ఏర్పాటు చేశారు.

లాక్‌డౌన్‌ అనేది ఓ అత్యవసర నిర్వహణ నియమం  

సాధారణ పరిభాషలో దీని అర్థం ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి రాకపోకలను నివారించడం.  

అధికార యంత్రాంగం మాత్రమే ఈ ప్రోటోకాల్‌ను ఉపయోగించే వెసులుబాటు ఉంటుంది.  

తమ పరిధిలోని ప్రజలను రక్షించడానికి పాలకులు ఈ ప్రోటోకాల్‌ను సాధారణంగా ఉపయోగిస్తారు.  

బాహ్య ప్రదేశాల నుంచి ఏదైనా ముప్పు ముంచుకు వస్తున్నప్పుడు లే దా ఇతర బాహ్య సంఘటన నుంచి రక్షించడానికి లాక్‌డౌన్‌ ప్రయోగిస్తారు. 

భవనాలలో లాక్‌డౌన్‌ అంటే తలుపులకు తాళాలు వేయడం. దీనివల్ల ఏ వ్యక్తి లోపలికి రారు, బయటికి పోరు. 

అలాగే, పూర్తి స్థాయి లాక్‌డౌన్‌ (ఫుల్‌ లాక్‌డౌన్‌) అంటే సాధారణంగా ప్రజలు వారు ఉన్న చోటనే ఉండాలి. 

చెప్పిన చోటు నుంచి ఎవరూ లోపలికి వెళ్లకూడదు. బయటకు రాకూడదు.  

లాక్‌డౌన్‌ రెండు రకాలు. ఒకటి నివారణ లాక్‌డౌన్‌ (ప్రివెంటివ్‌ లాక్‌డౌన్‌), రెండోది ఎమర్జెన్సీ లాక్‌డౌన్‌. 

ప్రజలు, సంస్థల భద్రతను దృష్టిలో పెట్టుకుని ముందస్తు నివారణ చర్యల్లో భాగంగా విధించేది ప్రివెంటివ్‌ లాక్‌డౌన్‌.  

అసాధారణమైన పరిస్థితి లేదా విపత్తును పరిష్కరించడానికి అమలు చేసే ముందస్తు చర్య ఇది. నివారణ చర్యలలో భాగం.  

ముంచుకొచ్చే ముప్పు తీవ్రతను తగ్గించడం దీని ప్రధాన ఉద్దేశం.  

ప్రాణాలకు తక్షణ ముప్పు లేదా ఇతరత్రా ప్రమాదం ముంచుకొస్తున్నప్పుడు ఎమర్జెన్సీ లాక్‌ డౌన్‌ను విధిస్తారు. 

For All Tech Queries Please Click Here..!
Topics: