అనుకున్నదొకటి, అవుతున్నదొకటి, స్ధానిక ఎన్నికల రీ షెడ్యూల్ కోరడం వెనుక విపక్షాల వ్యూహమిదేనా ?

Tuesday, March 17, 2020 09:38 AM Politics
అనుకున్నదొకటి, అవుతున్నదొకటి, స్ధానిక ఎన్నికల రీ షెడ్యూల్ కోరడం వెనుక విపక్షాల వ్యూహమిదేనా ?

ఏపీలో అధికార వైసీపీ దాడులు చేస్తుందని ఆరోపిస్తూ స్ధానిక ఎన్నికల వాయిదాకు పట్టుబట్టిన విపక్ష టీడీపీ, బీజేపీ, జనసేన ఇప్పుడు వాటిని ఏకంగా రీ షెడ్యూల్ చేయాల్సిందేనన్న రాగం అందుకుంటున్నాయి. క్షేత్రస్ధాయిలో అభ్యర్ధుల నుంచి ఎదురవుతున్న ఒత్తిడితో పాటు మరికొన్ని కీలక అంశాలే దీనికి కారణంగా తెలుస్తోంది. అయితే సుప్రీంకోర్టు తీర్పు రాకముందు ఎన్నికల వాయిదా లేదా రీ షెడ్యూల్ విషయంలో ఈసీ ఏ నిర్ణయం తీసుకోకపోవచ్చని తెలుస్తోంది.స్ధానిక ఎన్నికల పోరు ఆరువారాల పాటు వాయిదా పడటంతో ఊపిరీపీల్చుకుందామనుకున్న విపక్ష పార్టీలకు ఆ తర్వాత అభ్యర్దుల నుంచి ఒత్తిడి మొదలైంది. అసలే అధికార వైసీపీని ఎదిరించి, భారీగా డబ్బులు ఖర్చుపెట్టి ఎన్నికల్లో సీటు తెచ్చుకుని నామినేషన్ కూడా వేస్తే ఇప్పుడు ఎన్నికలు వాయిదా పడిపోతే తమ పరిస్ధితి ఏంటని అభ్యర్ధులు ప్రశ్నించడం మొదలుపెట్టారు. ఆరు వారాల పాటు ఎన్నికలు జరగకపోతే తాము వడ్డీలకు తెచ్చుకున్న డబ్బులతో పాటు అనుకూలంగా మార్చుకున్న పరిస్ధితులు ఎక్కడ తారుమారైపోతాయన్న ఆందోళన వారిలో వ్యక్తమవుతోంది. దీంతో నిత్యం పార్టీలో సీనియర్లతో మాట్లాడుతూ ఎన్నికలు ఎంత త్వరగా జరిపిస్తే అంత మంచిదనే డిమాండ్ వినిపిస్తున్నారు.

For All Tech Queries Please Click Here..!