జగన్ కీ బాబు కీ పోలికా?

Monday, September 16, 2019 10:45 AM Politics
జగన్ కీ బాబు కీ పోలికా?

అసలు ఇలా ఆలోచించడమే వృధా ఇద్దరికీ ఎంత తేడా, ముఖ్యంగా తటస్తంగా ఉండేవారు తెలుసుకోవాల్సిన విషయాలు ఇవి జగన్ సీఎం అయ్యి వంద రోజులు దాటింది. ఈ వంద రోజులు తాను ఏం చేసాడో ఒకసారి చూద్దాం అవినీతి లేకుండా పరిపాలన చేస్తా, నాకు మద్దతు ఇవ్వండి స్వయంగా ఐఏఎస్ లనూ, ఐపీఎస్ లనూ బ్రతిమాలాడాడు. వాళ్లందరినీ అన్నా/అమ్మా అంటూ ఆప్యాయంగా పిలుస్తూ పనులు చేయించుకుంటున్నాడు. మంచి పేరు ఉన్న, అవినీతి నశించాలి అంటూ, మేలుకొలుపు అని పుస్తకం రాసిన మాజీ ఐఏఎస్ అజేయ కళ్ళం ని సలహాదారుగా నియమించుకున్నాడు. స్వయంగా ఎమ్మెల్యేలకూ ఎంపీలకూ చెప్తున్నాడు, అవినీతి వద్దు అని. తాను బాగా నమ్మిన నవ రత్నాలను ఆఫీస్ లో తన ఎదుటే గోడ మీద వేయించుకున్నాడు. రిటైర్డ్ జడ్జి తో కమిషన్ వేసి, స్క్రూటినీ అయ్యాకే అన్ని కాంట్రాక్టులు ఇస్తాము అంటున్నాడు.

అసెంబ్లీ లో స్పీకర్ని బొమ్మలా ఆడించట్లేదు. అసెంబ్లీ సాక్షిగా, ప్రతిపక్ష ఎమ్మెల్యే లను నేను చేర్చుకోను అన్నాడు. ఎమ్మెల్యేలకు జయప్రకాశ్ నారాయణ చేత ట్రైనింగ్ ఇప్పించాడు, ప్రజాస్వామ్యం లో అసెంబ్లీలో వాళ్ళు ఎలా నడుచుకోవాలో చెప్పడానికి. ప్రజల కష్టాలు తెలుసుకోవడానికి స్పందన మొదలెట్టాడు. తానే స్వయంగా పర్యవేక్షణ చేస్తాను అంటున్నాడు. ఎప్పుడూ event management చేసింది లేదు ధర్మ పోరాటాలు, నవనిర్మాణాలూ, అంటూ అతి చేసింది లేదు. ఒక్కసారి కూడా అనవసరంగా మీడియా లో వచ్చి చెయ్యనివి చేశానని చెప్పలేదు. ప్రజల డబ్బు ఎక్కడా వృధా చెయ్యట్లేదు. ఈరోజు చంద్రబాబు మీడియా లో ఇంత హడావుడి చేస్తుంటే కూడా తన పని తాను చేసుకుపోతున్నాడు. ప్రభుత్వ స్కూల్స్ లో మంచి సదుపాయాలు పెంచి, ఇంటర్మీడియట్ కోసం స్కూల్స్ స్థాయిని పెంచుతాం అంటున్నాడు. రాష్ట్రం లో నిజంగా డబ్బులు లేవు. మొత్తం ఊడ్చేశారు పోయినోళ్ళు దేశం లోనే కాదు, మొత్తం ప్రపంచం లోనే ఆర్ధిక మాంద్యం అంటున్నారు. కొంత సమయం పట్టొచ్చు. పరిస్థితులు మెరుగవ్వడానికి. ఇంకా మూడు నెలలే అయ్యింది ఇంకా 57 నెలల ఉంది, ఒక ఏడాది అయితే కానీ ఒక అంచనా కీ రాలేము అప్పుడే దీర్గాలూ, శోకాలూ ఎందుకు కొంచెం విశ్రాంతి తీసుకోండి.

For All Tech Queries Please Click Here..!
Topics: