అధికారం ఎక్కడుంటే అక్కడకా! జూపూడి చేరికతో వైసీపీ లో తీవ్ర వ్యతిరేకతకు కారణం ఇదే..!

Tuesday, October 8, 2019 01:58 PM Politics
అధికారం ఎక్కడుంటే అక్కడకా! జూపూడి చేరికతో వైసీపీ లో తీవ్ర వ్యతిరేకతకు కారణం ఇదే..!

జూపూడి ప్రభాకర్ రావు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి ఎంట్రీ ఇవ్వడం విడ్డూరంగా మారింది. ఇది ఎంట్రీ కాదు. రీఎంట్రీ. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోగానే జూపూడి ఆ పార్టీకి దూరం అయ్యారు. ఆ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేసి ఓడిపోయిన వారిలో జూపూడి ఒకరు. తనను ఆ పార్టీ ముఖ్యనేతలే ఓడించారని జూపూడి ఆరోపించారట. దానికి నిరసనగా ఆ పార్టీకి రాజీనామా చేసి, తెలుగుదేశంలో చేరిపోయారు. ఎస్సీ ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జూపూడికి చంద్రబాబు వెంటనే పదవి ఇచ్చారు. అందుకు తగ్గట్టుగా చంద్రబాబు మీద జూపూడి చాలా స్వామిభక్తి చూపించారు. ఎంతగా అంటే... అంతవరకూ తను పొడిగిన జగన్ ను తీవ్రంగా విమర్శించడంతో పాటు చాలానే చేశారు.

చివరకు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలప్పుడు కూకట్ పల్లిలో డబ్బులు పంచుతూ దొరికారనే కేసులను కూడా ఎదుర్కొన్నారు! చదువుకున్న వ్యక్తి అయిన జూపూడి చివరకు అలా డబ్బులు పంచిన వ్యవహారంలో చిక్కడం పట్ల చాలామంది ఆశ్చర్యపోయారు. చంద్రబాబు మీద మరీ అంత భక్తి ఎందుకో అని ఆశ్చర్యపోయారు. చివరకు ఇప్పుడు ఈయన టీడీపీకి రాజీనామానట. ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టే ఈయన ఆ పార్టీలోకి చేరుతున్నారనేది దాచేది ఏమీకాదు. అధికారం ఎక్కడుంటే అక్కడ ఇలాంటి నేతలు వాలుతూ పోతూ ఉంటారంతే!

For All Tech Queries Please Click Here..!
Topics: