పెళ్లికి ముందు సెక్స్ అత్యాచారం కింద పరిగణించలేం : ఢిల్లీ హైకోర్టు

Thursday, February 4, 2021 03:15 PM Offbeat
పెళ్లికి ముందు సెక్స్ అత్యాచారం కింద పరిగణించలేం : ఢిల్లీ హైకోర్టు

New Delhi, Dec 17: సహజీవనం కేసులు ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. పెళ్లికి ముందు చాలా కాలం పాటు కలిసి ఉండి.. పెళ్లి పేరుతో సెక్స్ చేయడం అత్యాచారం కిందకు రాబోదని ఢిల్లీ హైకోర్టు (Delhi High Court) పేర్కొంది. ఓ యువతి దాఖలు చేసిన కేసుపై విచారణ సందర్భంగా ఢిల్లీ హైకోర్టు ఈ తీర్పు (Sex on Pretext of Marriage Not Always Rape) చెప్పింది.  నిరవధికంగా లేక సాధారణం కన్నా ఎక్కువ కాలంపాటు ఇద్దరూ కలిసి అన్యోన్యంగా ఉన్నపుడు, పెళ్లి చేసుకుంటాననే వాగ్దానాన్ని సెక్స్ వైపు ఆకర్షించేందుకు (Long-term sexual relation) ప్రోత్సహించడంగా చెప్పలేమని ధర్మాసనం తెలిపింది. కొన్ని కేసుల్లో పెళ్ళి చేసుకుంటాననే వాగ్దానం చేసిన తర్వాత సెక్స్‌‌కు అంగీకరిస్తారని గుర్తు చేసింది. జస్టిస్ విభు భక్రు ధర్మాసనం ఈ సంధర్భంగా గురువారం ఈ వ్యాఖ్యలు చేసింది. 

కొన్ని కేసుల్లో, ఓ పార్టీ సెక్సువల్ రిలేషన్స్‌కు సమ్మతించాలని అనుకోకపోయినప్పటికీ, పెళ్లి చేసుకుంటాననే వాగ్దానం ఆ పార్టీ సెక్సువల్ రిలేషన్స్ ఏర్పాటు చేసుకునేందుకు అంగీకరించే విధంగా ప్రలోభపెట్టే అవకాశం ఉంది. సంబంధిత పార్టీ వద్దని చెప్పాలనుకున్నప్పటికీ, అటువంటి ప్రలోభాలు నిర్దిష్ట క్షణంలో సమ్మతిని రాబట్టే అవకాశం ఉందని హైకోర్టు పేర్కొంది. కాగా పెళ్లి చేసుకుంటాననే తప్పుడు హామీలకు సంబంధించిన కేసుల్లో ఓ పార్టీ సమ్మతిని బలహీనపరిచే అవకాశం ఉంటుందని, ఆ విధంగా భారత శిక్షా స్మృతి ప్రకారం అత్యాచారం నేరం అవుతుందని తెలిపింది. సాధారణం కన్నా ఎక్కువ కాలంపాటు అన్యోన్యంగా ఉన్న సందర్భంలో దీనిని అత్యాచారంగా పరిగణించడం సాధ్యం కాదని ధర్మాసనం తేల్చి చెప్పింది. 

ఓ యువతి నిందితునితో తనకు 2008లో శారీరక సంబంధం ఏర్పడిందని, ఆ వ్యక్తి తనను పెళ్ళి చేసుకుంటానని హామీ ఇచ్చాడని ఫిర్యాదు దారు ఆరోపించారు. మూడు నెలల తర్వాత తనను పెళ్లి చేసుకుంటానని ఆ వ్యక్తి హామీ ఇవ్వడంతో తాను ఆయనతో కలిసి వెళ్లానని చెప్పారు. నిందితుడు తనపై అత్యాచారం చేశాడని ఆరోపించారు. ఈ ఆరోపణల నుంచి నిందితునికి హైకోర్టు విముక్తి కల్పించింది. అతనిని నిర్దోషిగా ఢిల్లీ హైకోర్టు విడుదల చేసింది.

For All Tech Queries Please Click Here..!