కోట్లు కుమ్మరించిన నాణెం..

Tuesday, January 21, 2020 09:47 AM Offbeat
కోట్లు కుమ్మరించిన నాణెం..

అదృష్టం తలుపు తెరిచేదాకా తట్టడం అంటే ఇదేనేమో మరి. ఒక్క నాణెం కోట్లు కుమ్మరించింది. వివరాల లోకి వెళితే దాదాపు 80 ఏళ్ల క్రితం నాటి నాణెం వేలంలో 9 కోట్ల 10 లక్షల రూపాయలు దక్కించుకోవడం విశేషం. ఇంతకీ దీని ప్రత్యేకత ఏమిటంటే నాటి బ్రిటన్ రాజు ఎడ్వర్డ్-8 బొమ్మ ఈ నాణెం మీద ముద్రించి ఉండడమే. అంతకు మించి మరే ప్రత్యేకతా లేకున్నా గుర్తు తెలియని వ్యక్తి భారీ మొత్తం వెచ్చించి ఈ నాణాన్ని దక్కించుకోవడం విశేషం. 

1936 కింగ్ ఎడ్వర్డ్-8 అమెరికన్ మహిళ విల్లిస్ సింప్సనను వివాహం చేసుకోవాలనుకున్నాడు. అందుకోసం ఏకంగా సింహాసనాన్నే పరిత్యజించాలనుకున్నాడట. ఈ కాలానికి ముందు ముద్రించిన నాణెం కావడం వల్లే దీనికి అంత గిరాకీ అన్నది పరిశీలకులు అభిప్రాయం.

For All Tech Queries Please Click Here..!
Topics: