ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ నన్ను బస్ డ్రైవర్ అని పిలిచేవాడు..!

Sunday, May 10, 2020 02:41 PM Offbeat
ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ నన్ను బస్ డ్రైవర్ అని పిలిచేవాడు..!

ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ తనను బస్ డ్రైవర్ అని పిలిచేవాడని టీమిండియా మాజీ క్రికెటర్ మహ్మాద్ కైఫ్ తెలిపారు. కైఫ్ తొలిసారి HELO యాప్‌లో అనేక విషయాలను పంచుకున్నాడు. తన ఫీల్డింగ్ నైపుణ్యాలతోనే తనను అభిమానులు గుర్తించారని కైఫ్ చెప్పారు. తన ఫీల్డింగ్‌తో దిగ్గజ క్రికెటర్లు సచిన్, గంగూలీల నుంచి గౌరవం అందుకున్నట్లు కైఫ్ తెలిపాడు. ఈ సందర్భంగా ఇంగ్లాండ్‌ మాజీ క్రికెటర్ నాసిర్ హుస్సేన్ తనను బస్ డ్రైవర్‌గా సంబోంధించిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. తాను చాలా ఎక్కువగా మాట్లాడేవాడినని, దీంతో నాసిర్ హుస్సేన్ తనను  'బస్ డ్రైవర్' అని పిలిచాడని కైఫ్ చెప్పుకొచ్చాడు. అదే సమయంలో ఈ బస్ డ్రైవర్‌ది చెడ్డ ఇన్నింగ్స్ కాదని అతడితో చెప్పినట్లు కైఫ్ తెలిపాడు. ప్రస్తుత క్రికెటర్లలో జడేజా అత్యుత్తమ ఫీల్డర్‌ అని కైఫ్ తెలిపాడు. అజారుద్దీన్, రాబిన్ సింగ్‌లు కూడా మంచి ఫీల్డర్లు అని చెప్పిన కైఫ్ హార్దిక్ పాండ్యా మంచి ఆటగాడని... అతడు గనుక తన ఫిట్‌నెస్‌ను కాపాడుకోగలిగితే అద్భుతాలు చేయగలడని కైఫ్ అభిప్రాయపడ్డాడు. 

ర్యాపిడ్ ఫైర్:
1. ప్రశ్న - సచిన్ లేదా కోహ్లీ?
జవాబు: సచిన్
2. ఉత్తమ కెప్టెన్ -  గంగూలీ / ద్రవిడ్ / కుంబ్లే / ధోని?
జవాబు: గంగూలీ
3. ఫాస్ట్ బౌలర్ - జహీర్ ఖాన్ / జవగళ్ శ్రీనాథ్ / కపిల్ దేవ్ / ఇశాంత్ శర్మ
జవాబు: జహీర్ ఖాన్
4. స్పిన్నర్ - అనిల్ కుంబ్లే/హర్భజన్ సింగ్?
జవాబు: అనిల్ కుంబ్లే
5. ఉత్తమ కోచ్ - గ్రెగ్ చాపెల్/ జాన్ రైట్?
జవాబు: గ్రెగ్ చాపెల్

For All Tech Queries Please Click Here..!
Topics: