నాన్నకు "ప్రేమతో సెల్యూట్..."

Tuesday, March 2, 2021 02:15 PM Offbeat
నాన్నకు

Amaravati, Jan 4: పోలీసు డిపార్ట్‌మెంట్ లో ఉన్నతాధికారి కి కింది తరగతి పోలీసులు సెల్యూట్ చెయ్యటమనేది సాధారణమైన విషయం, అయితే ఇక్కడ ఆ ఉన్నతాధికారి తన కూతురు అయితే? ఆ తండ్రి చేసే సెల్యూట్ లో ఆనందంతో పాటు ప్రేమ - గర్వం రెండూ కలగలిపి ఉంటాయి..అదే ఇప్పుడు ఈ ఫోటోల్లో కనిపిస్తోంది.

ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విభజన తరువాత ఏపి పోలీసు శాఖ ప్రతిష్టాత్మకంగా తిరుపతి లో‌ నిర్వహిస్తున్న మొట్ట మొదటి పోలీస్ డ్యూటీ మీట్ 2021కి "ఇగ్నైట్" అని పేరు పెట్టారు. ఈ ఈవెంట్లో కూతురికి తండ్రి సెల్యూట్ చేస్తున్న అరుదైన దృశ్యం కనిపించింది.

కథనంలోకి వెళితే.. 2018 బ్యాచ్ కి చెందిన జెస్సి ప్రశాంతి గుంటూరు అర్బన్ సౌత్ డిఎస్పి చార్జ్ తీసుకున్నారు. ప్రస్తుతం తిరుపతిలో జరుగుతున్న పోలీస్ డ్యూటీ మీట్ లో "దిశ" విభాగం లో బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తిరుపతి కళ్యాణి డ్యామ్ లో పోలీస్ ట్రైనింగ్ సెంటర్ లో సర్కిల్‌ ఇన్స్పెక్టర్ గా ఆమె తండ్రి శాంసుందర్ పని చేస్తున్నారు

ఈ ఈవెంట్లో కూతురు తన కంటే పెద్ద ర్యాంక్ లో తన కంటి ముందు ఉన్నతాధికారులతో మాట్లాడుతూ డ్యూటీ చేస్తుండటం దూరం నుండి చూస్తూ ఆనందంగా దగ్గరకెళ్ళి నమస్తే మేడం అంటూ ఆ తండ్రి సెల్యూట్ చేశారు, తను కూడా వెంటనే సెల్యూట్ చేసి.. ఆ తరువాత... ఏంటి నాన్నా...అంటూ గట్టిగా నవ్వేశారు.

పిల్లలు ప్రయోజకులు అయినప్పుడు తండ్రికి ఇంతకంటే సంతోషం మరోకటి ఉండదు, నా బిడ్డ నీతి నిజాయితీగా ప్రజలకి సేవచేస్తుందని నాకు నమ్మకం ఉందని ఆ తండ్రి గర్వంగా చెబుతున్నారు.

దీనిపై తిరుపతి ఎస్పీ రమేష్ రెడ్డి మాట్లాడుతూ.. "ఇటువంటివి సహజంగా సినిమాలో చూస్తుంటాం. కాని తిరుపతి డ్యూటీ మీట్ లో తండ్రీ కూతురు ఇలా యూనీఫామ్ ధరించి ప్రజాసేవ చెయ్యటం నాకు వ్యక్తిగతం గా చాలా గర్వంగా ఉంది ఆల్ ది బెస్ట్ ప్రశాంతి" అని డిఎస్పి ప్రశాంతిని అభినందించారు

For All Tech Queries Please Click Here..!