హిందూమహా సముద్రంలో వింత ఆకారాలు, భయపడుతున్న శాస్త్రవేత్తలు (వీడియో)..!

Saturday, April 11, 2020 12:29 PM Offbeat
హిందూమహా సముద్రంలో వింత ఆకారాలు, భయపడుతున్న శాస్త్రవేత్తలు (వీడియో)..!

హిందూ మహాసముద్రంలో చిత్ర విచిత్ర ఆకారాన్ని అమెరికా శాస్త్రవేత్తలు గుర్తించారు. ఓ పొడవైన తీగ వంటి ఆకారాలు ఉండి సుమారు 150 అడుగుల వరకు ఉన్న మెరుపుతీగ మాదిరి ఉన్న వింత ఆకారాన్ని గుర్తించారు. ఇంతవరకు సముద్రంలో ఇలాంటి వింతను ఎవరూ ఎప్పుడూ చూడలేదని పరిశోధకులు అంటున్నారు. హిందూ మహాసముద్రంలోని నింగాలూ కాన్యన్ ప్రాంతంలో ఇది నీటిపై తేలియాడుతుండగా అమెరికాకు చెందిన ష్మిట్ ఓషన్ ఇన్‌స్టిట్యూట్ పరిశోధకులు తమ డ్రోన్ కెమెరాలో దీని ఆకారాన్ని బంధించారు.

ఇది సైఫనోఫోర్ వర్గానికి చెందిన అపోలెమియాగా శాస్త్రవేత్తలు వెల్లడించారు. దీనిని నీటిపై తేలియాడే కాలనీ అని కూడా అన్నారు. ఇవి జెల్లీఫిష్, కోరల్స్ వర్గానికి చెందిన జీవులని, సముద్ర గర్భంలో బాగా లోతైన ప్రాంతాల్లో సంచరిస్తుంటాయని తెలిపారు. దీని గురించి ఈ పరిశోధనలో పాలుపంచుకున్న మెరైన్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ కార్లీ వీనర్ ట్లాడుతూ వాస్తవానికి సైఫనోఫోర్ జీవులు చాలా చిన్నవి. చూడ్డానికి క్లోనింగ్ చేసిన జీవుల్లా ఒకేలా ఉంటాయి. అవి అన్నీ కలిసి ఒకే దేహంలా పనిచేస్తాయి. వాటిలో కొన్ని ప్రత్యేకించి ఆహారం అందించడం, కొన్ని ప్రత్యుత్పత్తి చేయడం, మరికొన్ని ఈదడం వంటి పనులకే పరిమితం అవుతాయి. అయితే ఇంత భారీగా ఎప్పుడూ, ఎక్కడా కనిపించలేదు అని కార్లీ తెలిపారు.

For All Tech Queries Please Click Here..!
Topics: