విమానాలకి కూడా టోల్గేట్ చార్జీలు ఉంటాయి, ఎలా వాసులు చేస్తారో తెలుసా?

Thursday, July 23, 2020 09:37 AM Offbeat
విమానాలకి కూడా టోల్గేట్ చార్జీలు ఉంటాయి, ఎలా వాసులు చేస్తారో తెలుసా?

సాధారణంగా మనం రహదారులను వాడుకున్నందుకు టోల్ చార్జిలను చెల్లించాల్సి వస్తుందని అందరికీ తెలిసిన విషయమే. అయితే విమానాలకు కూడా ఇలాంటి చార్జిలే ఉంటాయి వాటిని టోల్ చార్జిలు కాదు రూట్ నావిగేషన్ ఫెసిలిటీస్ చార్జెస్ (Route Navigation Facilities Charges) (RNFC) అని పిలుస్తారు. అంటే ఆకాశంలో విమానాలు మన దేశానికి చెందిన ఎయిర్ స్పేస్ గుండా వెళితే మన దేశానికి ఆయా విమానాలకు చెందిన కంపెనీలు చార్జిలను చెల్లించాల్సి ఈ RNFC చార్జీలు చెలించాల్సి ఉంటుంది.

జాతీయ, అంతర్జాతీయ విమానాలు అన్ని మన దేశంలో ఎయిర్ స్పేస్ గుండా వెళితే ఒక్కో విమానానికి విడివిడిగా చార్జిలను చెల్లించాల్సి ఉంటుంది. ఈ చార్జిలను ఎయిర్పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ)కి చెల్లించాల్సి ఉంటుంది. ఏఏఐ మన దేశంలో ఎయిర్ స్పేస్ ని కంట్రోల్ చేస్తుంది. ఐక్యరాజ్యసమితి నియమాల ప్రకారం ప్రతి దేశానికి దాని సముద్ర తీర ప్రాంతం నుంచి 370 కిలోమీటర్ల వరకు ఎయిర్ స్పేస్ ఉంటుంది. ఇక తీర ప్రాంతం లేని దేశాలు అయితే వాటి దేశాల సరిహద్దుల వరకే ఎయిర్ స్పేస్ ఉంటుంది.

మన దేశ ఎయిర్ స్పేస్ లో  విమానాలు ఎన్ని నాటికల్ మైళ్లు ప్రయాణించాయి అనే అంశాన్ని ఆధారంగా చేసుకుని విమానయాన కంపెనీల నుంచి ఏఏఐ ఆర్ఎన్ఎఫ్సీలను వసూలు చేస్తుంది. ఇక ఎయిర్ స్పేస్ లో విమానాలు ప్రయాణించిన దూరంతోపాటు వాటి బరువును కూడా పరిగణనలోకి తీసుకుని చార్జిలను లెక్కిస్తారు. ఏటీసీ టవర్ల ద్వారా విమానాల రాకపోకలను, ఎయిర్ ట్రాఫిక్ ని నియంత్రిస్తారు. మన దేశానికి విశాలమైన ఎయిర్ స్పేస్ ఉండడంతో మన దేశం ఎయిర్ స్పేస్ లో ప్రయాణించే విమానాలకు భారీగానే చార్జిలు పడతాయి. హాంగ్కాంగ్ నుంచి దుబాయ్, షాంగాయ్ నుంచి దోహా, బీజింగ్ నుంచి అబుధాబి వెళ్లే అంతర్జాతీయ విమానాలు మన దేశ ఎయిర్ స్పేస్ వాడుకుంటాయి. ఇందుకుగాను భారత్ ఎయిర్ స్పేస్ అరుణాచల్ ప్రదేశ్ నుంచి మొదలై గుజరాత్ వద్ద ముగుస్తుంది. 

ఇక సింగపూర్ నుంచి లండన్, ఆస్ట్రేలియా నుంచి ప్యారిస్కు వెళ్లే అంతర్జాతీయ విమానాలకు అండమాన్ నికోబార్ దీవుల వద్ద భారత ఎయిర్ స్పేస్ ప్రారంభమవుతుంది. అది భారత్, పాక్ సరిహద్దు అయిన రాజస్థాన్, పంజాబ్ల వద్ద ముగుస్తుంది. దీని పొడవు సుమారుగా 2500 కిలోమీటర్లు ఉంటుంది. అంటే అన్ని కిలోమీటర్ల పాటు ఎయిర్ స్పేస్ వాడుకున్నందుకు ఆయా విమానాలు ఏఏఐకి చార్జిలను చెల్లించాలన్నమాట.

ఒక్క విమానం ప్ర‌యాణించేందుకు స‌గ‌టు ఎయిర్‌స్పేస్ చార్జిలు రూ.46వేలు అవుతాయి‌. అదే ఆ విమానం తిరుగు ప్ర‌యాణం చేస్తే మ‌రో రూ.46వేలు అవుతాయి. ఇలా విమానం ఆ రూట్‌లో ఎన్నిసార్లు తిరిగితే అన్ని సార్లు ఎయిర్‌స్పేస్ చార్జిల‌ను చెల్లించాల్సి ఉంటుంది. అయితే తీర‌ప్రాంతంలో ఎయిర్‌స్పేస్‌ను వినియోగించుకుంటే మ‌రో రూ.4వేలు అద‌నంగా అవుతాయి. అంటే రూ.50వేలు అవుతాయి. ఇక దేశంలో 24 గంట‌ల స‌మ‌యంలో 100 విమానాలు క‌నీసం తిరుగుతాయి. అంటే దాదాపుగా రూ.50 ల‌క్ష‌లు వ‌స్తాయి. ఇవ‌న్నీ తిరుగు ప్ర‌యాణం చేస్తే రూ.1 కోటి అవుతుంది. అంటే కేవ‌లం విమానాల‌కు ఎయిర్‌స్పేస్ ఇవ్వ‌డం ద్వారానే ఏఏఐ నిత్యం దాదాపుగా రూ.1 కోటి వ‌ర‌కు సంపాదిస్తుంది‌.

For All Tech Queries Please Click Here..!
Topics: