కరోనా: తుపాకులు కొనుగోలు చేస్తోన్న అమెరికన్లు, ఎందుకో తెలుసా?

Saturday, April 4, 2020 11:55 AM News
కరోనా: తుపాకులు కొనుగోలు చేస్తోన్న అమెరికన్లు, ఎందుకో తెలుసా?

కరోనా వైరస్ వల్ల అమెరికన్ల మైండ్ సెట్ మారినట్లు అనిపిస్తుంది. మార్చి నెలలో గన్ షాపులను ఎక్కువమంది అమెరికన్లు సందర్శించారు. గతంలో ఎన్నడూ ఇంతమంది తుపాకుల కొనుగోలు కోసం రాలేదని ఎఫ్‌బీఐ పేర్కొన్నది. గతంలో ఎన్నడూ లేనివిధంగా వారు తుపాకులు కొనుగోలు చేస్తున్నారు గత ఏడాది కంటే 80% ఎక్కువ తుపాకులు అమ్ముడుపోయాయి. సాధారణంగానే అమెరికాలో నల్లజాతీయలు అంటే శ్వేత జాతీయులకు పడదు. ఇప్పుడు కరోనా వైరస్ వణికిస్తోన్న క్రమంలో తుపాకీలు కొనడం ప్రాధాన్యం సంతరించుకుంది. కానీ తుపాకులు ఎక్కువ అమ్ముడుపోవడానికి కారణం అది కాదని మరొ రీజన్ ఉంది అని నేషనల్ రైఫిల్ అసోసియేషన్ చెబుతోంది.

తుపాకీ కొనుగోలు కోసం 2.4 మిలియన్ల మంది దరఖాస్తు చేసుకున్నారని తెలిపింది. గతేడాది మార్చి నెల కన్నా ఈ ఏడాది 80 శాతం ఎక్కువ మంది దరఖాస్తు చేసుకున్నారని తెలిపింది.మార్చి 16 నుంచి నెలాఖరు వరకు 1.2 మిలియన్ల మంది బ్యాక్గ్రౌండ్  చెక్ చేశామని వివరించారు. ఎఫ్‌బీఐ చెక్ చేసి రిపోర్ట్ ఇచ్చాక గన్ డీలర్లు ఆర్డర్ మేరకు తుపాకులను అందజేస్తారు. అమెరికాలో తుపాకీ కొనుగోలు చేయడం ఫ్యాషన్ కాదని.. కానీ తమ భద్రత కోసం కొనుగోలు చేసేందుకు ప్రజలు మొగ్గుచూపుతున్నారని నేషనల్ రైఫిల్ అసోసియేషన్ తెలిపింది. ఆపత్కాలంలో తమతోపాటు కుటుంబసభ్యులు, ప్రేమించేవారిని కాపాడేందుకు తుపాకులు కొనుగోలు చేస్తారని వెల్లడించింది. కరోనా వైరస్ ప్రబలుతోన్న నేపథ్యంలో తుపాకులు కొనుగోలు చేస్తున్నారనే అంశాన్ని కొట్టిపారేసింది.

For All Tech Queries Please Click Here..!
Topics: