కరోనా పుట్టుక, కరోనా నష్టానికి ప్రాయశ్చితం తప్పదు: ట్రంప్‌

Saturday, May 2, 2020 10:45 AM News
 కరోనా పుట్టుక, కరోనా నష్టానికి ప్రాయశ్చితం తప్పదు: ట్రంప్‌

ప్రపంచ ఆరోగ్య సంస్థ పైన‌ ట్రంప్‌ మరోసారి నిప్పులు చెరిగారు. తాను రెండో దఫా అధ్యక్షుడిగా గెలవడం చైనాకు ఇష్టం లేదని అన్నారు. చైనా నుంచి ప్రతి నెల బిలియన్‌ డాలర్లను దిగుమతి సుంకం రాబట్టడమే ఇందుకు కారణంగా పేర్కొన్నారు. మాజీ ఉపాధ్యక్షుడు, రాబోయే ఎన్నికల్లో తన ప్రత్యర్థి జో బిడెన్‌ విజయం సాధించాలనేది చైనా కోరికని అన్నారు. చైనా మనకు ఎప్పుడూ ఏమీ ఇవ్వలేదు. ఒబామా, బిడెన్‌ హయాంలో ఎనిమిదేళ్లు వారు మన నుంచి చాలా తీసుకున్నారు. నేనొచ్చాక వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్నా.

 వైరస్‌ తరహా ఉదంతాలు అంగీకార యోగ్యం కాదు అని ట్రంప్‌ అన్నారు. కరోనా నష్టానికి గాను చైనా వస్తు సేవలపై భారీ సుంకాలు విధిస్తామని ట్రం ప్‌ స్పష్టం చేశారు. అయితే, పరిహారం కింద ఆ దేశంతో రుణ లావాదేవీలను మాత్రం రద్దు చేయబోమన్నారు. అలా చేస్తే అమెరికా కరెన్సీ ప్రత్యేకత దెబ్బతింటుందన్నారు. ఓవైపు కరోనా మానవ సృష్టి కాదని అమెరికా నిఘా వర్గాలు చెబుతున్నా, ట్రంప్‌ మాత్రం వూహాన్‌ ప్రయోగ శాల నుంచి వచ్చిందేనని తిరిగి ఆరోపించారు. ‘ఈ మేరకు మీకేమైన కచ్చితమైన సమాచారం ఉందా?’ అని మీడియా సమావేశంలో ఓ రిపోర్టర్‌ ప్రశ్నించగా.. ‘ఉంది. ఉంది. నేనది చెప్పలేను. అందుకు నాకు అనుమతి లేదు’ అన్నారు. కరోనా విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ తీరును దుయ్యబట్టారు. 

For All Tech Queries Please Click Here..!
Topics: