ఢిల్లీ పోలీసుల షాకింగ్ రిపోర్ట్: మొత్తం 16 వేల మందికి పైగా

Sunday, May 3, 2020 09:46 AM News
ఢిల్లీ పోలీసుల షాకింగ్ రిపోర్ట్: మొత్తం 16 వేల మందికి పైగా

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా ఏరిగాయి, దానికి ప్రధాన కారణమైనట్లు అనుమానిస్తోన్న ఢిల్లీ సామూహిక మత ప్రార్థనలపై అక్కడి పోలీసులు విచారణ చేసి ఇచ్చిన తాజా నివేదిక ఇప్పుడు వెన్నులో వణుకు పుట్టించే విషయాలను వెలుగులోకి వచ్చాయి. ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో గల మర్కజ్ భవన సముదాయంలో నిర్వహించిన తబ్లిగి జమాత్ సామూహిక మత ప్రార్థనల్లో 16 వేల మంది పాల్గొన్నట్లు ఢిల్లీ పోలీసులు తమ తాజా నివేదికలో పొందుపరిచినట్లు సమాచారం. ఈ నివేదికను కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు అందజేశారు.

దేశ రాజధానిలోని నిజాముద్దీన్ ప్రాంతంలో గల మర్కజ్ మసీదు భవన సముదాయంలో మూడు రోజుల పాటు తబ్లిగీ జమాతీ సామూహిక మత ప్రార్థనలను నిర్వహించారు. మసీదు మతపెద్ద మౌలానా సాద్ సారథ్యంలో నిర్వహించిన ఈ ప్రార్థనలకు దేశం నలుమూలల నుంచీ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇండోనేషియా, మలేసియా వంటి పొరుగు దేశాల నుంచీ పెద్ద సంఖ్యలో ఇందుల పాల్గొన్నారు. ఇలా.. మార్చి 13 నుంచి 24 తేదీల మధ్య ఏకంగా 16 వేల మంది మర్కజ్ మత ప్రార్థనల్లో దశలవారీగా పాల్గొన్నట్లు ఢిల్లీ పోలీసులు వెల్లడించారు.

For All Tech Queries Please Click Here..!
Topics: