తెలంగాణ పోలింగ్ : మధ్యాహ్నం 1 గంట సమయానికే...

Friday, December 7, 2018 02:46 PM News
తెలంగాణ  పోలింగ్ : మధ్యాహ్నం 1 గంట సమయానికే...

తెలంగాణ రాష్ట్రంలో పోలింగ్ ప్రక్రియ వేగంగా కొనసాగుతుంది. మధ్యాహ్నం 1 సమయానికే యాభై శాతం పోలింగ్ నమోదుకాగా ఇంకా పోలింగ్ కేంద్రాల వద్ద భారీ క్యూలైన్లు కనిపిస్తున్నాయి. ఓటింగ్ ప్రక్రియ వేగంగా జరుగుతుండడంతో ఓటర్లు కూడా ఉత్సాహంగా ఓటేసేందుకు ముందుకు వస్తున్నారు. ఎక్కడో ఒకటి రెండు కేంద్రాల వద్ద మినహా అంతటా ఈవీఎం మిషన్లు వేగంగా పనిచేయడంతో ఓటర్లు కూడా ఉత్సాహంగా ఓటేసేందుకు కేంద్రాలకు చేరుతున్నారు. ఇప్పటికే యాభైశాతం పోలింగ్ నమోదు కావడంతో సాయంత్రానికి భారీ పోలింగ్ నమోదు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.