తెలంగాణ పోలింగ్ సాగుతోందిలా...

Friday, December 7, 2018 11:30 AM News
తెలంగాణ  పోలింగ్ సాగుతోందిలా...

తెలంగాణ వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. పలు చోట్ల ఏవీఎంలు మెరాయించాయి. వాటిని సరి చేసిన తరువాత మళ్లీ పోలింగ్ యథాతథంగా సాగుతోంది. పెద్దపల్లి జిల్లా మంథని, రామగుండం జిల్లాలలో పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. పోలీసులు పోలింగ్ బూత్ ల వద్ద భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. కాగా కరీనంగర్ లోని ఉర్దూ మీడియం హైస్కూల్లో ఎంపీ వినోద్ కుమార్ దంపతులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే పోచంపల్లి స్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ లో ఎమ్మెల్సీ నారదాసు దంపతులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. హుజూరాబాద్ లో పోలింగ్ బూత్ నంబర్ 47లో ఈవీఎం మొరాయించడంతో దాదాపు గంటన్నర పాటు పోలింగ్ నిలిచిపోయింది.అలాగే 133వ నంబర్ పోలింగ్ బూత్ లో కూడా ఈవీఎం మెరాయించడంతో చాలా సేపు పోలింగ్ నిలిచిపోయింది.