ప్రధాని మోదీతో సీఎం కేసీఆర్ భేటీ: కీలకంగా చర్చించిన అంశాలివే...

Wednesday, December 26, 2018 10:47 PM News
ప్రధాని మోదీతో సీఎం కేసీఆర్ భేటీ: కీలకంగా చర్చించిన అంశాలివే...

టీఆర్ఎస్ జాతీయ అధ్యక్షుడు కేసీఆర్ తెలంగాణ రాష్ట రెండవ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత నేడు ప్రధాని మోదీతో తొలిసారి భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ప్రధానంగా రాష్ట్రానికి మరియు తెలుగు రాష్ట్రాల విభజనకు సంబంధించిన అంశాలపై చర్చించినట్లు తెలిసింది. వీటితో పాటు మరో 16 కీలక అంశాలను మోదీతో ప్రస్తావించారు. అందులో...

  • హైదరాబాదులో ఇండియన్ ఇన్‌స్ట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (IIM) ఏర్పాటు.
  • హైదరాబాదులో ఇండియన్ ఇన్‌స్ట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ 
  • కరీంనగర్‌లో ఇండియన్ ఇన్‌స్ట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IIIT) ఏర్పాటు.
  • కొత్తగా ఏర్పడిన 21 జిల్లాల్లో జవహర్ నవోదయ విద్యాలయాల ఏర్పాటు
  • వరంగల్‌లో ఉన్న కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్ అభివృద్ది కోసం రూ. 1,000 కోట్లు నిధుల మంజూరు
  • జహీరాబాద్‌లో ఉన్న నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ కోసం నిధులు
  • అదిలాబాద్‌లో సిమెంట్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా పునరుద్దరణ
  • ఏపీ పునర్విభజన చట్టంలోని షెడ్యూల్ 9, 10 సంస్థల విభజన 
  • కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా
  • సెక్రటేరియట్, రహదారి నిర్మాణ పనుల కోసం బైసన్ పోలో గ్రౌండ్ భూముల బదిలీ
  • పునర్విభజన చట్టం ప్రకారం వెనుకబడిన ప్రాంతాల కోసం రూ.450 కోట్లు గ్రాంట్స్ నిధులు విడుదల
  • ఏపీ పునర్విభజన చట్టంలోని షెడ్యూల్ 9, 10 సంస్థల విభజన
  • కృష్ణా జలాల వివాద పరిష్కారానికి వినతి
  • ప్రతిపాదిత రైల్వే ప్రాజెక్టుల పనుల పూర్తి అంశం
  • ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన ప్రతిపాదన
  • ఎస్సీ వర్గీకరణ బిల్లు 

For All Tech Queries Please Click Here..!